గ్లోబ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ దేవర చిత్రం ఏప్రిల్ 5 2025 టార్గెట్ గా చక చకా షూటింగ్ ఫినిష్ చేసుకుంటుంది. తాజాగా దేవర విషయంలో డెవిల్ హీరో కళ్యాణ్ రామ్ ఇస్తున్న చిన్న చిన్న అప్ డేట్స్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. తాజాగా దేవర మూవీ షూటింగ్ 80 శాతం పూర్తయ్యింది అని చెప్పిన కళ్యాణ్ రామ్.. దేవర ఎన్నడూ చూడనంత విజువల్ ట్రీట్ గా ఉండబోతుంది, అది ఊహించడానికి కూడా కష్టమని చెబుతున్నారు.
దేవర షూటింగ్ మొదలు కాకముందే విడుదల తేదీ మీద క్లారిటీ వుంది కనుకే ఏప్రిల్ 5 డేట్ ని పక్కాగా అనౌన్స్ చేసాం, చాలా టఫ్ ప్రొడక్షన్ ఈ సినిమా, దేవర లో ఓ సీన్ కోసం భారీ లెవల్లో ఓ సంప్ తవ్వాల్సి వచ్చింది. అది చాలా కష్టమైన పని. ఇక దేవర పార్ట్1 ఏప్రిల్ 5 న విడుదల కాబోతుంది. రెండో భాగం టచ్ చేయడం లేదు. ముందు ఇది పూర్తి కావాలి. ప్రతీదీ పక్కా ప్లానింగ్ తో జరుగుతోంది.. (ఆచార్య తర్వాత) కొరటాల శివని ఎందుకు అంతగా నమ్మాం అనేది మీకు దేవర గ్లిమ్ప్స్ చూసిన తరువాత అర్థం అవుతుంది అంటూ కళ్యాణ్ రామ్ తన తమ్ముడి దేవర సినిమాపై అంచనాలను రెట్టింపు చేసేసారు.