యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న దేవర పై బజ్ బాగా క్రియేట్ అయ్యింది. ఫుల్లీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ దేవర లుక్ లో మాస్ గా అరగొట్టేసారు. ఈ చిత్రానికి కళ్యాణ్ రామ్ ఒక నిర్మాత. ఆయన తన డెవిల్ ప్రమోషన్స్ లో భాగంగా దేవర పై క్రేజీ అప్ డేట్స్ వదులుతున్నారు. డెవిల్ ట్రైలర్ లాంచ్ టైమ్ లో దేవర గ్లిమ్ప్స్ గురించి చెప్పి గూస్ బంప్స్ తెప్పించిన కళ్యాణ్ రామ్ ఈరోజు ఇంటర్వ్యూలో దేవర షూటింగ్ అప్ డేట్ ఇచ్చారు.
దేవర మూవీ రెండు పార్థుగా వస్తుంది, ఇప్పటికే మొదటి భాగం 80 శాతం షూటింగ్ పూర్తయినట్లుగా చెప్పడంతో ఎన్టీఆర్ ఫాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. మార్చ్ నెలలో మొదలైన దేవర షూటింగ్ చిన్నపాటి బ్రేక్ కూడా లేకుండా నిర్విరామంగా కొరటాల తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ కూడా కొరటాలకి సహకరిస్తున్నారు. ప్రస్తుతం ఓ వారం షూటింగ్ నుంచి గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో న్యూ ఇయర్ వేడుకల కోసం జపాన్ వెళ్లారు.
జపాన్ నుంచి రాగానే దేవర తదుపరి షెడ్యూల్ మొదలు పెట్టేందుకు కొరటాల రెడీ అవ్వడమే కాదు.. న్యూ ఇయర్ కి దేవర గ్లిమ్ప్స్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం.