మహేష్ బాబు-శ్రీలీల కాంబో స్టిల్ వదిలి ఒక్కసారిగా గుంటూరు కారం పై అంచనాలను రెట్టింపు చేసి.. విమర్శించిన నోళ్ళని మూపించిన నిర్మాత నాగవంశీ.. మహేష్ అభిమానులకి అదిరిపోయే క్రిస్టమస్ గిఫ్ట్ ఇచ్చారు. నిన్నమొన్నటివరకు గుంటూరు కారం పై ఉన్న అనుమానాలన్నీ ఒకే ఒక్క ఫొటోతో పటాపంచలైపోయాయి. మహేష్-శ్రీలీల మధ్యలో దుమ్మురేపే సాంగ్ డిసెంబర్ 29 న విడుదల కాబోతుంది. ఈ సాంగ్ 31 నైట్ ప్రతి పార్టీలో వినిపించడం ఖాయమనే మాట వినిపిస్తోంది.
ఇక గుంటూరు కారం ట్రైలర్ పై మహేష్ అభిమానుల్లోనే కినుకు ఉంది. ఇప్పుడు గుంటూరు కారం ట్రైలర్ కూడా రాబోతుంది. అది జనవరి 6 న జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గుంటూరు కారం ట్రైలర్ వదలాలని, ఈ వారమంతా మూడో పాటతోనే అభిమానులకి కిక్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. గుంటూరు కారం విడుదలకి కేవలం 15 రోజులు సమయమే ఉండడంతో.. ఇకపై ప్రమోషన్స్ పక్కాగా మొదలు పెట్టే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నారని తెలుస్తోంది.
రేపు 29 న రాబోయే పాటని ఊహించుకుంటూ మహేష్-శ్రీలీల మాసివ్ పిక్ ని షేర్ చేసుకుంటూ మహెష్ అభిమానులు తెగ ఇదైపోతున్నారు. ఇక ఈ చిత్రంలో జగపతి బాబు విలన్ గా, రెండో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తుంది.