చాలామంది సెలబ్రిటీస్ తమ పిలల్లని కెమెరాలకు కనిపించకుండా చాలా గుంభనంగా ఉంచుతారు. తారలు తల్లితండ్రులైతే వారి పిల్లలెలా ఉంటారో చూడాలనే ఆత్రుత నెటిజెన్స్ లో ఉంటుంది. అందుకు తగ్గట్టే ఫోటో గ్రాఫర్స్ కూడా ఎగబడిపోయి వాళ్ళని చూపించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. చాలామంది సెలబ్రిటీస్ తమ పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. బాలీవుడ్ అలియా భట్, రణబీర్ కపూర్, క్రికెటర్ కోహ్లీ-అనుష్క, టాలీవుడ్ హీరో రామ్ చరణ్-ఉపాసనలు, నయనతార-విగ్నేష్ తమకి పుట్టిన పిల్లలకు కెమెరాల ముందుకు కనిపించకుండా ఉన్నారు.
ఆ తర్వాత సందర్భం చూసుకుని తమ పిల్లలకి మీడియాలో చూపిస్తున్నారు. నయనతార-విగ్నేష్ లు అంతే. విగ్నేష్ శివన్ పుట్టిన రోజు సందర్భంగా పిలల్లని అభిమానులకి పరిచయం చెయ్యగా.. అలియా భట్-రణబీర్ లు ఈరోజు క్రిష్ట్మస్ సందర్భంగా తమ కుమార్తె రాహా కపూర్ మీడియాకి అభిమానులకి చూపించారు. మొదటిసారి రణబీర్-అలియాల గారాల పట్టిని చూసి అందరూ ముచ్చటపడిపోయారు.
రాహా బేబీ చాలా క్యూట్ గా కనిపించింది. అచ్చం రణబీర్ తండ్రి రిషి కపూర్ లా రాహా ఉంది.. ఇంకా అలియాలా అందమైన మొహం రాహా కి వచ్చింది అంటూ రాహా కపూర్ ని చూసి నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బయటకు వెళ్లినప్పుడు చాలాసార్లు తమ కూతురి ముఖం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఇప్పుడు అలియా కూతురు రాహా ఫోటో మాత్రం నెట్టింట వైరలవుతుంది.