Advertisementt

ఎయిర్ పోర్ట్ లో తారక్ ఫ్యామిలీ

Mon 25th Dec 2023 05:13 PM
tarak,ntr  ఎయిర్ పోర్ట్ లో తారక్ ఫ్యామిలీ
Tarak family vacation in Japan ఎయిర్ పోర్ట్ లో తారక్ ఫ్యామిలీ
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ వేడుకల కోసం విదేశాలకి చెక్కేస్తున్నాడు. గత ఏడాది తన భార్య పిల్లలతో కలిసి న్యూ ఇయర్ వేడుకలని అమెరికా వేదికగా జరుపుకున్న ఎన్టీఆర్ ఈసారి న్యూ ఇయర్ ని జపాన్ లో జరుపుకోబోతున్నాడు. ఎన్టీఆర్-రామ్ చరణ్ కలయికలో రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ మూవీ జపాన్ లో విడుదలై విపరీతంగా ఆడేసింది. ఇప్పటికి ఆర్.ఆర్.ఆర్ అక్కడ జపాన్ లో క్రేజీగా కనిపిస్తుంది.

ఇక దేవర షూటింగ్ నుంచి కొద్దిగా బ్రేక్ తీసుకున్న ఎన్టీఆర్ ఫ్యామిలీ ట్రిప్ వేశారు. ఈరోజు క్రిష్ట్మస్ సోమవారం రోజున భార్య లక్ష్మి ప్రణతి, పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో కలిసి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి వచ్చారు. దానితో ఎన్టీఆర్ ఫ్యామిలీ పిక్స్ తీసేందుకు కెమేరామ్యాన్స్ పోటీపడ్డారు. ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి 2024 కి ఆహ్వానం పలకడానికి జపాన్ వెళ్ళారన్నమాట. కొన్నాళ్లుగా దేవర షూటింగ్ లో తలమునకలైన ఎన్టీఆర్ ఇప్పుడే చిన్నపాటి బ్రేక్ తీసుకున్నాడు. 

Tarak family vacation in Japan:

NTR and his family vacation in Japan

Tags:   TARAK, NTR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ