మహేష్ అభిమానులు గుంటూరు కారం అప్ డేట్స్ కోసం నిర్మాత నాగవంశీని తగులుకోని రోజు లేదు, సినిమా విడుదలకి ఇంకా 23 రోజుల మాత్రమే సమయం ఉంది, కానీ ఇప్పటివరకు గుంటూరు కారం ట్రైలర్ అప్ డేట్ ఇవ్వకుండా ఫాన్స్ సహనానికి పరీక్ష పెడుతున్నారు. అయితే ఇప్పుడు మహేష్ అభిమానులు కొందరు కోనసీమ వారికి చెందిన వారు నిర్మాత నాగవంశీకి మాస్ వార్నింగ్ ఇస్తున్నారు.
సోషల్ మీడియా వేదికగా అసలు ఏం అనుకుంటున్నారు కోనసీమ అంటే.. ఈస్ట్ రిలీజ్ విషయంలో తేడా వస్తే కోనసీమని తగలబెట్టేస్తారు🤙🔥 @vamsi84 konchem chuskune release chey🙏. DEAR chintu @vamsi84 Konaseema wise sarriga theatres ivvakapothey Konaseema tagalettestam 🔥 అంటూ నిర్మాత నాగవంశీకి మహేష్ కోనసీమ అభిమానులు ఇచ్చిన వార్నింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే వాళ్ళు ఎందుకంతగా చెబుతున్నారంటే.. ఈ సంక్రాంతికి చాలా సినిమాలు పోటీ పడుతున్నాయి. అందులో ఏ సినిమాకి ఎన్ని థియేటర్స్ కేటాయించాలనే విషయంలో నిర్మాతలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఎవరైనా తమ సినిమాని పోస్ట్ పోన్ చేసుకుంటారేమో అని మీటింగ్ పెట్టినా ఎవ్వరూ ఒప్పుకోవడం లేదు. అందుకే తమ హీరోకి ఎక్కువ థియేటర్స్ కేటాయించరేమో అని ముందుగానే మహేష్ అభిమానులు నిర్మాతని ఇలా వార్న్ చేస్తున్నారన్నమాట.