పుష్ప సినిమాతో గ్లోబల్ రేంజ్‌కి చేరుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం పుష్ప 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా విడుదల తేదీ అయితే ప్రకటించారు కానీ.. ఆ తేదీకి కష్టమే అనేలా వార్తలు వినిపిస్తున్నాయి. కారణం సుకుమార్ ఈ సినిమాని నత్తనడకన షూట్ చేస్తున్నారనే టాక్‌తో పాటు.. కేశవ పాత్రలో నటించిన జగదీశ్ జైలుకి వెళ్లడమే అని తెలుస్తుంది. పుష్ప 2 సంగతి ఇలా ఉంటే.. ఇప్పుడు బన్నీ బ్లాక్‌మెయిల్‌కి దిగినట్లుగా సోషల్ మీడియా అంతా ఒకటే టాక్ నడుస్తుంది. ఇంతకీ బన్నీ ఎవరిని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని అనుకుంటున్నారా? ఇంకెవరిని తన తండ్రి అల్లు అరవింద్‌ని.
ఇదేదో ఆస్తి గొడవని, ఆస్తి రాసివ్వలేదని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని అనుకుంటున్నారేమో.. అలాంటిదేమీ లేదు. సరదాగా తన తండ్రి అల్లు అరవింద్‌పై బన్నీ జోక్స్ వేస్తుంటారనే విషయం తెలియంది కాదు. పలు పబ్లిక్ స్టేజ్‌లపై తన తండ్రి గురించి సరదాగా మాట్లాడి.. ఆ తర్వాత ఆయనే తనకు అన్నీ అని బన్నీ చెబుతుంటాడు. అలాగే తాజాగా ఆయన ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ కూడా సరదాగా ఆటపట్టించేదే. ఇంతకీ ఆ పోస్ట్ ఏంటంటే..
ఈ ఐకాన్ స్టార్ నటించిన మొట్టమొదటి చిత్రానికి నిర్మాత అయిన అల్లు అరవింద్ ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ ఇవ్వలేదట. విజేత సినిమా 100 డేస్ షీల్డ్ పట్టుకుని ఉన్న అల్లు అరవింద్ ఫొటోని షేర్ చేసిన అల్లు అర్జున్.. నా మొదటి సినిమా విజేత మరియు నా నిర్మాత నాన్న అని చెప్పుకొచ్చాడు. omg! Just realised he didnt pay me for that అంటూ బాధపడుతున్నట్లుగా ఓ ఎమోజీని పోస్ట్ చేశాడు. బన్నీ షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీనికి.. మా అన్నను మోసం చేస్తూనే ఉంటారా అరవింద్‌గారూ.. అంటూ బన్నీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుండటం విశేషం.