శుక్రవారం సలార్ రిలీజ్ అయ్యింది.. సూపర్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే ఇంత పెద్ద చిత్రంలో నటించిన ప్రభాస్ సలార్ ని అసలు పట్టించుకోలేదనే విమర్శ ఉంది. సినిమా విడుదలకు ముందు కానీ తర్వాత కానీ ప్రభాస్ సలార్ పై ఎలాంటి ట్వీట్స్ వేయడం లేదు. ప్రమోషన్స్ ని కూడా ప్రభాస్ చాలా చప్పగా ముగించేశారు. రామౌళితో కామన్ ఇంటర్వ్యూ తప్ప ప్రభాస్ మీడియాకి మళ్ళీ కనిపించలేదు. అసలు సినిమా విడుదలవుతుంది అంటూ కూడా ట్వీటెయ్యలేదు.
అతని కో స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ మాత్రం సలార్ నుంచి వచ్చే ప్రతి అప్ డేట్ ని సోషల్ మీడియాలో ప్రమోట్ చేసారు. సలార్ లో వరదరాజ పాత్రలో ప్రభాస్ తో పోటీపడిన పృథ్వీ రాజ్ సుకుమారన్ సలార్ ని వీలున్నంతవరకు ప్రమోట్ చేసారు. సినిమా విడుదలయ్యాక సోషల్ మీడియా వేదికగా సలార్ ని ఎవరు బావుంది అని ట్వీట్ చేసినా దానికి థాంక్స్ చెబుతూ రిప్లై ఇస్తున్నారు. కానీ ప్రభాస్ హడావిడి కనిపించడమే లేదు. దానితో చాలామంది ప్రభాస్ ఎక్కడా అంటూ మాట్లాడుతున్నారు.
నిజంగానే ప్రభాస్ సలార్ విషయంలో చాలా లైట్ గా వున్నారు. లేదంటే సలార్ స్టార్స్ తో ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించినట్టయితే సలార్ కి మరిన్ని ఓపెనింగ్స్ వచ్చేవి. కానీ ప్రభాస్ సుముఖంగా లేనందువల్లే మేకర్స్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపలేదు. ఇప్పుడు హిట్ అయ్యాకా సలార్ ని హిట్ చేసిన ఫాన్స్ కి థాంక్స్ చెప్పినా మరింత క్రేజీగా ఉండేది అనేది నెటిజెన్స్ ఫీలింగ్.