Advertisementt

డెవిల్ కి దూరంగా తారక్

Sun 24th Dec 2023 08:58 PM
ntr,devil event  డెవిల్ కి దూరంగా తారక్
Jr NTR unable to come to Devil event డెవిల్ కి దూరంగా తారక్
Advertisement
Ads by CJ

ఈసారి అన్నయ్య కళ్యాణ్ రామ్ కి తారక్ సారి చెప్పసాడనే న్యూస్ మొదలయ్యింది. అన్నదమ్ములు అంటే ఇలానే ఉండాలి అనుకునేలా గత కొన్నాళ్లుగా కళ్యాణ్ రామ్-ఎన్టీఆర్ ల మధ్యన అనుబంధం కనిపిస్తుంది. వీరిద్దరూ కలిసికట్టుగా నందమూరి ఫ్యామిలీకి కాస్త దూరంగా కనిపిస్తున్నారు. నందమూరి కుటుంబాన్ని పక్కనబెట్టి మరీ తమ్ముడి కోసం కళ్యాణ్ రామ్ నిలబడుతున్నాడు. అటు ఎన్టీఆర్ కూడా అన్న కోసం చెయ్యాల్సింది చేస్తున్నాడు. కళ్యాణ్ రామ్ సినిమాలకి ఎన్టీఆర్ తన వంతు సహాయం చేస్తున్నాడు.

కళ్యాణ్ రామ్ సినిమాల ఈవెంట్స్ కి వచ్చి అన్న సినిమాలకి క్రేజ్ తెస్తున్నాడు. బింబిసార, అమిగోస్ ఇలా ప్రతి సినిమాకి ఎన్టీఆర్ అన్న కోసం ప్రమోషన్స్ చేస్తున్నాడు. కానీ ఇప్పుడు కళ్యాణ్ రామ్ డెవిల్ ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ పాలు పంచుకోలేకపోతున్నాడనే న్యూస్ వైరల్ గా మారింది. ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు ఫాన్స్ ముందుకు వస్తారా అని ఎదురు చూస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. కానీ ఎన్టీఆర్ డెవిల్ ఈవెంట్స్ కి రావడం లేదని సమాచారం.

కారణం ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో క్రిష్ట్మస్, న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం విదేశాలకి వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తోంది. సెలబ్రిటీస్ లో చాలామంది న్యూ ఇయర్ వేడుకల కోసం ఏదో ఒక దేశాన్ని ఎంచుకుని కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతూ ఉంటారు. గత ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో పాటుగా అమెరికాలో న్యూ ఇయర్ ని సెలెబ్రేట్ చేసుకున్నారు. అదే విధంగా ఈ ఏడాది కూడా న్యూ ఇయర్ ని అలానే ప్లాన్ చేసుకోవడంతో ఎన్టీఆర్ డెవిల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాలేకపోతున్నట్లుగా తెలుస్తుంది.

Jr NTR unable to come to Devil event:

NTR unable to come to Kalyan Ram Devil pre release event

Tags:   NTR, DEVIL EVENT
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ