నిన్న శుక్రవారం విడుదలైన ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ మూవీకి యునానమస్ గా ఏమి పాజిటివ్ టాక్ రాలేదు. క్రిటిక్స్ బావుంది అన్నా కొంతమంది యూత్ మాత్రం ఏముంది సలార్ లో.. ప్రశాంత్ నీల్ కేవలం హీరో గా ప్రభాస్ ఎలివేషన్స్ తప్ప ఏమి చూపించలేదు. ఇక సలార్ లో కీలకంగా కనిపించిన పృథ్వీ రాజ్ సుకుమారన్ పాత్రలో కూడా అంత బలం లేకుండా చేసారు, యాక్షన్ తప్ప అంతగా మెచ్చేది, చెప్పుకునేది ఏది లేదు.. క్రిటిక్స్ అంతలా రివ్యూస్ కి రేటింగ్స్ ఎందుకు ఇచ్చారో అంటూ మాట్లాడుతున్నారు.
మొదటిరోజు బెన్ ఫిట్ షో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించిన ప్రభాస్త ఫాన్స్ తప్ప మిగతా చాలామంది యూత్ సలార్ విషయంలో నెగెటివ్ గానే మాట్లాడుతున్నారు. సినిమాలో ఏం లేదు, కథ లేకుండా కేవలం హీరో ఎలివేషన్స్ పైనే దృష్టి పెట్టారు., ఇక పార్ట్ 2 కోసం కూడా తెగ వెయిట్ చేసేంతగా ఏమి లేదు అంటున్నారు. అయితే యూత్ ఎలా మాట్లాడినా, ఎమన్నా సలార్ వసూళ్లు మాత్రం భీభత్సంగా ఉన్నాయి. మొదటి రోజు ఓపెనింగ్స్ వైజ్ గా ప్రభాస్ బాక్సాఫీసుని ఊచకోత కోస్తూ ఈ ఏడాది హైయెస్ట్ ఓపెనింగ్స్ కొల్లగొట్టాడు. ఇక రెండో రోజు వచ్చేసరికి 295 కోట్ల గ్రాస్ తో ఔరా అనిపించింది. యూత్ అంటున్నట్టుగా సలార్ మరీ బ్యాడ్ గా లేదు. కేవలం ఫాన్స్ మాత్రమే సినిమాని ఎత్తితే ఈ రేంజ్ కలెక్షన్స్ అయితే రావు.
మాస్ ఆడియన్స్ సలార్ కి ఓటేశారు. దానితో రోజు రోజుకి సలార్ కలెక్షన్స్ పరుగులు పెడుతున్నాయి. అందులోను లాంగ్ వీకెండ్, క్రిస్టమస్ సెలవలు కలిసొచ్చాయి. దానితో ఏం మాట్లాడినా ఎలా ఉంది అన్నా సలార్ కలెక్షన్స్ కి మాత్రం బ్రేకులు పడేలా లేవు. ఇక సంక్రాంతి వరకు మరో భారీ సినిమా కూడా లేకపోవడం సలార్ కి కలిసిచ్చేలా ఉంది.