Advertisementt

దెబ్బకి దారికొచ్చిన పల్లవి ప్రశాంత్

Sun 24th Dec 2023 11:07 AM
pallavi prashanth  దెబ్బకి దారికొచ్చిన పల్లవి ప్రశాంత్
Pallavi Prashanth Granted Bail దెబ్బకి దారికొచ్చిన పల్లవి ప్రశాంత్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ విన్నర్ అయ్యి గర్వంగా బయటికొచ్చిన పల్లవి ప్రశాంత్ కి ఆయన అభిమానులు ఘన స్వాగతం పలకడమే కాదు.. పల్లవి ప్రశాంత్ ని హౌస్ లో టార్గెట్ చేసిన అమర్ దీప్ పై పల్లవి ప్రశాంత్ ఫాన్స్ దాడి చెయ్యడమే కాకుండా బిగ్ బాస్ సెట్ బయట అరాచకం సృష్టించారు. దానితో రంగంలోకి దిగిన పోలీసులు పల్లవి ప్రశాంత్ ని వెనుక గేటు నుంచి బయటికి వెళ్ళమని, మెయిన్ గెట్ నుంచి బయటికి వస్తే అభిమానులు మరింత రెచ్చిపోతారని నచ్చ చెప్పినా.. మనోడు విన్నర్ అయిన గర్వంతో అభిమానుల మధ్య నుంచి హడావిడి చేస్తూ వెళ్లడంతో పోలీసులు కేసు పెట్టి ప్రశాంత్ ని జైల్లో వేశారు.

మూడు రోజుల పాటు చంచల్ గూడా జైలులో ఊచలు లెక్కబెట్టిన పల్లవి ప్రశాంత్ ఇప్పుడు దారికొచ్చాడు. అంటే శుక్రవారం బెయిల్ వచ్చాక నిన్న శనివారం పల్లవి ప్రశాంత్ జైలు నుంచి విడుదలయ్యాడు. పల్లవి ప్రశాంత్ విడుదలయ్యే సరికి ఆయన అభిమానులు జైలు దగ్గరకి వెళ్లి అతనితో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. అయితే ఈసారి ఎలాంటి రిస్క్ చెయ్యడానికి సిద్ధంగా లేని పల్లవి ప్రశాంత్ సైలెంట్ గా కారు ఎక్కి వెళ్లిపోవడంతో అబ్బ బిగ్ బాస్ విన్నర్ కి గర్వం అణిగింది.. దెబ్బకి దారికొచ్చాడంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.

Pallavi Prashanth Granted Bail:

Bigg Boss Telugu 7 Winner Pallavi Prashanth Granted Bail

Tags:   PALLAVI PRASHANTH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ