సంక్రాంతికి విడుదల చేస్తామని చెప్పిన సినిమాలన్నీ ఒక్కొక్కటిగా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టేసారు. ముఖ్యంగా సంక్రాంతి సినిమాల ట్రైలర్స్ ఇప్పటికే విడుదలవుతున్నాయి. అలాగే ఇటు ఇంటర్వూస్ అంటూ సంక్రాంతి హీరోలు యాక్టీవ్ గా కనబడుతున్నారు. కానీ మహేష్-త్రివిక్రమ్ గుంటూరు కారం మాత్రం అన్నిటిలో వెనుకబడిపోయి కనిపిస్తుంది. సంక్రాంతి కి రిలీజ్ అన్న వారంతా మీటింగ్ పెట్టారు. ఎవ్వరూ తమ సినిమాలని పోస్ట్ పోన్ చేసే ఆలోచనలో లేరు.
అందుకే ప్రతి సినిమా మేకర్స్ ప్రమోషన్స్ హడావిడి చేస్తున్నారు. అయితే సంక్రాంతికి రాబోయే రవితేజ ఈగల్, ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ ల హనుమాన్ ట్రైలర్స్ వచ్చేసాయి. ఈ రెండు పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమాలు అంటూ మాట్లాడుకుంటున్నారు ప్రేక్షకులు. ఇక నాగార్జున నా సామిరంగా, వెంకటేష్ మూవీస్ కూడా సంక్రాంతికే వస్తున్నాయి. వాటి ప్రమోషన్స్ మనకెందుకు మనకు కావాల్సింది గుంటూరు కారం ప్రమోషన్స్ అంటూ మహెష్ ఫాన్స్ పట్టుబట్టుకుని కూర్చున్నారు, అందులో భాగంగా మహెష్ గుంటూరు కారం ట్రైలర్ కోసం మేకర్స్ ని అడుగుతున్నారు.
నిర్మాత నాగవంశీ సూపర్ ఫాన్స్ మీరు కంగారు పడకండి, గుంటూరు కారం సంక్రాంతికి రిలీజ్ ఉంటుంది.. అప్ డేట్స్ వస్తాయని చెబుతున్నా మహేష్ ఫాన్స్ మాత్రం గుంటూరు కారం ట్రైలర్ వస్తే కానీ నమ్మేలా కనిపించడం లేదు ప్రస్తుత పరిస్థితి. మరి ఆ అప్ డేట్ ఎప్పుడు వస్తుందో చూద్దాం.