అసలు గేమ్ ఛేంజర్ షూటింగ్ ప్రోగ్రెస్ చూసాక ఆ సినిమా 2024 లో విడుదలయ్యే ఛాన్స్ లేదు అనే అభిప్రాయానికి చాలామంది వచ్చేసారు. అదే ప్రచారం సోషల్ మీడియాలో మొదలైంది. దిల్ రాజు గారు గేమ్ ఛేంజర్ షూటింగ్ 80 శాతం పూర్తయ్యింది అంటే.. మరొకరు ఇంకా 70 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ వుంది అంటూ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ చూసిన మెగా ఫాన్స్ కక్కలేకమింగలేక ఉన్నారు.
అయితే రామ్ చరణ్-శంకర్ కలయికలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ విడుదలపై చిన్నపాటి క్లారిటీ ఇచ్చారు నిర్మాత దిల్ రాజు. తాజాగా దిల్ రాజు గేమ్ ఛేంజర్ వచ్చే ఏడాది 2024 సెప్టెంబర్ లో అంటే వినాయక చవితి కి విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లుగా చెప్పడంతో మెగా ఫాన్స్ కాస్త కూల్ అయ్యారు. అసలు 2025 సంక్రాంతి వరకు గేమ్ ఛేంజర్ విడుదల ఉండదనుకుని నిరాశపడిన మెగా అభిమానులకి దిల్ రాజు ఇచ్చిన ఈ అప్ డేట్ అమృతంలా మారింది.