Advertisementt

మంగళవారం ఓటిటి డేట్ వచ్చేసింది

Sat 23rd Dec 2023 08:19 PM
mangalvaaram  మంగళవారం ఓటిటి డేట్ వచ్చేసింది
Mangalvaaram on Hotstar Streaming మంగళవారం ఓటిటి డేట్ వచ్చేసింది
Advertisement
Ads by CJ

నవంబర్ 17 న విడుదలైన పాయల్ రాజ్ ఫుట్-అజయ్ భూపతిల మంగళవారం మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ని బాగా ఇంప్రెస్ చేసింది. లేడీస్ నచ్చిన, మెచ్చిన చిత్రంగా మంగళవారం నిలిచింది. మంగళవారం విడుదలకు ముందు పెద్దగా బజ్ కనిపించలేదు. కారణం ప్లాప్ డైరెక్టర్, ప్లాప్ హీరోయిన్ పాయల్ కలయికలో తెరకెక్కిన మూవీ కావడంతో మంగళవారంపై ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించకపోయినా.. విడుదలైన రోజు పాజిటివ్ టాక్ తెచ్చుకుని జనాలు థియేటర్స్ వైపు కదిలేలా చేసింది.

మంగళవారం కలెక్షన్స్ పరంగా నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. అందుకే మంగళవారం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఓటిటి, ఫ్యామిలీ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. అసలైతే విడుదలైన నెలకే హిట్ సినిమాలు ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి. కానీ మంగళవారం విడుదలై నెలదాటిపోయినా.. ఈ చిత్రం ఓటిటి స్ట్రీమింగ్ పై క్లారిటీ ఇవ్వలేదు. కానీ తాజాగా పర్ఫెక్ట్ డేట్ తో మంగళవారం ఓటిటి డేట్ లాక్ చేసారు..మేకర్స్. 

డిస్ని ప్లస్ హాట్ స్టార్ నుంచి మంగళవారం చిత్రం వచ్చే మంగళవారం అంటే డిసెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ చెయ్యనున్నట్లుగా ప్రకటించింది. మరి థియేటర్స్ లో మిస్ అయిన ఈ హిట్ చిత్రాన్ని ఓటిటిలో వీక్షించేయ్యండి.

Mangalvaaram on Hotstar Streaming :

Mangalvaaram on Hotstar Streaming from 26th Dec

Tags:   MANGALVAARAM