నిన్న శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సలార్ మూవీ గురించిన వార్తలే సోషల్ మీడియాలో కనబడుతున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ కటౌట్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. యాక్షన్ సీక్వెన్స్, ప్రశాంత్ నీల్ హీరో ఎలివేషన్స్ సీన్స్ అన్ని హై ఓల్టేజ్ ని అందించాయంటూ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే సలార్ విడుదలకు ముందు విడుదల తర్వాత కానీ హీరోయిన్ శృతి హాసన్ ముచ్చట వినిపించలేదు. సలార్ ప్రమోషన్స్ లో ఎక్కడా శృతి కనిపించలేదు. రాజమౌళితో కామన్ ఇంటర్వ్యూలో కూడా ప్రశాంత్ నీల్, ప్రభాస్, పృథ్వీ రాజ్ సుకుమారన్, నిర్మాతలే కనిపించారు తప్ప శృతి కనబడలేదు.
ఇక సలార్ విడుదలయ్యాక అందరూ ప్రభాస్ గురించి, ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ గురించి మాట్లాడుతున్నా.. ఎక్కడా ఆధ్య పాత్ర పోషించిన శృతి హాసన్ పేరు తియ్యడం లేదు. గ్లామర్ గా కనిపించకపోయినా, సాంగ్స్ లేకపోయినా శృతి హాసన్ కీలకమైన పాత్రలో కనబడింది. ఆద్య పాత్ర అంతగా హైలెట్ అవ్వకపోయినా ప్రభాస్ ని ఎలివేట్ చేసే పాత్రలో శృతి హాసన్ సింపుల్ గా కనబడింది. మరి అంత పెద్ద సినిమాలో శృతి నటించింది అంటే ఆమె ఏ రేంజ్ లో సినిమా గురించి మాట్లాడాలి.
కానీ శృతి హాసన్ మాత్రం సలార్ విషయాలేమి మాట్లాడకుండా మౌనంగా ఉంది. కారణం ఆమె పాత్ర తాలూకు వెయిట్ సలార్ పార్ట్2 లో ఉంటుందేమో.. అందుకే అప్పటివరకు అలానే సైలెంట్ గా ఉంటుందేమో అంటున్నారు. ఇక సలార్ లో మరో నటి శ్రియ రెడ్డి నటించింది. సలార్ విడుదలయ్యాక శ్రీయారెడ్డి కటౌట్స్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఆమె కూడా సలార్ ని వీలైనంతవరకు ప్రమోట్ చేస్తుంది. కానీ శృతి హాసనే బొత్తిగా కామ్ గా కనిపించింది.