Advertisementt

హ్యాపీ మోడ్ లో తారక్ అభిమానులు

Sat 23rd Dec 2023 12:15 PM
ntr fans  హ్యాపీ మోడ్ లో తారక్ అభిమానులు
Tarak fans in happy mode హ్యాపీ మోడ్ లో తారక్ అభిమానులు
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ గా తన క్రేజ్ పెంచుకున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ నుంచి రాబోయే దేవర విషయంలో ఓ అంచనాకు రాలేకపోతున్నారు ఆయన అభిమానులు. ప్యాన్ ఇండియా మూవీ గానే దేవర మొదలైనా నార్త్ లో దేవర క్రేజ్ ఎలా ఉంటుందో అనేది వారికి అంతుబట్టడం లేదు. ఈలోపు వార్ 2  తో ఎన్టీఆర్ బాలీవుడ్ తెరంగేట్రం దేవరకి కలిసొస్తుంది అని వారు కూల్ అవుతున్నారు.

ఇదంతా అలా ఉంటే తారక్ ఫాన్స్ లో ఇప్పుడు ఖుషి మోడ్ కనబడుతుంది. ఎన్టీఆర్ తన తదుపరి చెయ్యబోయే చిత్రం విషయంలో వారు చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. కారణం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కలయికలో రాబోయే మూవీపై ఇప్పుడు అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో కూడా చెప్పడం కష్టం. ప్రశాంత్ నీల్ లేటెస్ట్ చిత్రం సలార్ ఆ రేంజ్ టాక్ తో ఇండియా నుంచి ఓవర్సీస్ బాక్సాఫీసుని అల్లాడిస్తుంది. ప్రశాంత్ నీల్ సలార్ లో ప్రభాస్ ని చూపించిన తీరుకి, హీరోయిజం ఎలివేట్ చేసిన విధానానికి అందరి హీరోలు అబ్బుర పడుతున్నారు.

అందుకే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ని ఓ రేంజ్ చూపెడతాడు, మాస్ గా ప్రెజెంట్ చేస్తాడు అని ఫిక్స్ అవుతున్నారు. ఎన్టీఆర్ తో చెయ్యబోయే చిత్రంలో నలుపు రంగు, బొగ్గు గనులు, బానిసలు లాంటివి లేకుండా ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తానని ప్రశాంత్ నీల్ ఎప్పుడో చెప్పాడు. దీనిని బట్టి ఎన్టీఆర్ ని ప్రశాంత్ మాస గానే చూపిస్తాడు అని తారక్ ఫాన్స్ డిసైడ్ అవ్వడమే కాదు, సలార్ చూసాక తారక్ విషయంలో వాళ్ళు హ్యాపీ మోడ్ లోకి వెళుతున్నారు.

Tarak fans in happy mode :

NTR fans are happy on Salaar talk

Tags:   NTR FANS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ