బిగ్ బాస్ లోకి కామన్ మ్యాన్ గా ఎంటర్ అయిన పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ టాగ్ తో సింపతీ క్రియేట్ చేసుకున్నప్పటికీ.. అమర్ లాంటి వాళ్ళు పల్లవి ప్రశాంత్ ని నామినేషన్స్ లో టార్గెట్ చేయడంతోనే అతనికి బిగ్ బాస్ మైలేజ్ పెరిగింది. శివాజీ రెండో వారంలోనే చెప్పాడు. వాడిని నామినేట్ చేసి హీరోని చెయ్యకండి అని. కానీ అదే జరిగింది. బిగ్ బాస్ లో అతన్ని నామినేట్ చేసినప్పుడల్లా సింపతీ ఓట్స్ పడ్డాయి. బిగ్ బాస్ మధ్యలోకి వచ్చేసరికే ప్రశాంత్ విన్నర్ అంటూ సోషల్ మీడియాలో టాక్ స్ప్రెడ్ అయ్యింది.
ఇక బయటికొచ్చాక పల్లవి ప్రశాంత్ అభిమానులు చేసిన పనితో అతను కాస్త ఇబ్బంది పడినా.. ఇప్పుడు హీరో అయ్యాడు. పల్లవి ప్రశాంత్ అభిమానుల రచ్చ వలన అతను జైలు కెళ్ళాడు. అక్కడ నుంచి బయటకు రావడానికి అతనికి చాలామంది లాయర్లు ఫీజు లేకుండా వాదించారట. రైతు బిడ్డని తొక్కేస్తున్నారు అంటూ మీడియాలో నానా హడావిడి. మరోపక్క పల్లవి ప్రశాంత్ తోటి కంటెస్టెంట్స్ అతనికి మద్దతుగా ఛానల్స్ లో మట్లాడడం, భోలే ఏకంగా లాయర్లతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టడం.. ఇవన్నీ పల్లవి ప్రశాంత్ గ్రాఫ్ పెరగడానికి కారణమయ్యాయి.
మరి సామాన్య రైతు బిడ్డగా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన పల్లవి ప్రశాంత్ ని అతనితోటి వాళ్ళు, అభిమానులే హీరోని చేసారు. ఏమి తెలియని అమాయకుడిలా ఉండే ప్రశాంత్ ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. అదే పల్లవి ప్రశాంత్ కాన్ఫిడెన్స్ కి కారణం కూడా.