బాహుబలి దగ్గరనుంచి సౌత్ హీరోల ప్యాన్ ఇండియా మూవీస్ విడుదలవుతున్నాయి అంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒణుకు మొదలవుతుంది. సౌత్ హీరోలు బాలీవుడ్ బాక్సాఫీసుని ఊచకోత కోస్తున్నారు. సౌత్ మూవీస్ డామినేషన్ నార్త్ పై స్పష్టంగా కనబడుతుంది. అందుకే సౌత్ మూవీస్ విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకోకపోయినా ..ఇక్కడి సినిమాలపై నార్త్ వాళ్ళు విషం చిమ్ముతున్నారు. కొన్నాళ్ల క్రితం హిందీ మూవీస్ వస్తున్నాయంటే నేపోటిజం విషయంలో నెటిజెన్స్ కన్నెర్ర జేసేవారు.
అయితే ఇప్పుడు పనిగట్టుకుని సౌత్ మూవీస్ విషయంలో నార్త్ వాళ్ళు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. తమ సినిమాపైకి సలార్ ని వదిలారనే కసితో.. నార్త్ లో డంకి మేకర్స్ సలార్ కి థియేటర్స్ దొరక్కుండా చేసారు. సరే డంకి విడుదలైంది. ఆ వెంటనే సలార్ వచ్చేసింది. సోషల్ మీడియాలో సలార్ కి సూపర్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. నార్త్ నుంచి టాప్ క్రిటిక్స్ కూడా సలార్ విషయంలో పాజిటివ్ గానే కాదు సినిమా హిట్ అంటూ ట్వీట్లు వేస్తున్నారు.
కానీ నార్త్ లో ఓ వర్గం వారు పనిగట్టుకుని ట్విట్టర్ X లో #SalaarFlopShow, Trending with DUNKI CRUSHES SCAMMER SALODA, #DunkiBlockbuster డంకి హిట్ అంటూ.. సలార్ ప్లాప్ షో అంటూ ట్రెండ్ చేస్తున్నారు. మరి ప్రభాస్ సలార్ ముందు షారుఖ్ డంకి డల్లయ్యింది. అందుకే తట్టుకోలేని నార్త్ ఇండియన్స్ సలార్ పై కడుపుమంట చూపిస్తున్నారు.