ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అభివృద్ధి ఏ నేత అయినా చేస్తారు. వచ్చే ఎన్నికలను సైతం దృష్టిలో పెట్టుకుని సంక్షేమం బీభత్సంగా చేయడమంటే మామూలు మాటలు కాదు. అది ఒక్క జగన్మోహన్ రెడ్డికే సాధ్యం. ఇటీవల ఆయన తన 50వ పుట్టినరోజు జరుపుకున్న విషయం తెలిసిందే. అప్పుడొక అద్భుతాన్ని ఆయన సృష్టింపజేసుకున్నారు. తన చిత్రపటాన్ని గీయించుకున్నారు. అత్యంత నీచ నికృష్ట దుర్భర జీవితం గడుపుతున్నట్టుగా జనం.. వారిని ఉద్దరించడం కోసమే పుట్టిన ఏసయ్యగా జగన్.. దీనిలో విపక్షాలను కూడా చేర్చారండోయ్.. ఈ విడ్డూరాలన్నింటినీ చాటుమాటుగా విపక్షాలు చూస్తున్నట్టుగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇక ఈ పోస్టర్‌ను వైరల్ చేసే బాధ్యతను వైసీపీ నేతలు భుజానికి ఎత్తుకున్నారు.
ఆ కేసులన్నింటినీ తొక్కిపట్టారు..
ఇక వైసీపీ సోషల్ మీడియాను ఎంతగా వినియోగించుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీమ్స్‌ను పెట్టుకుని మరీ ఏం జరిగినా తమకు అనుకూలంగా మార్పించుకుని ప్రచారం చేయించుకుంటుంది. కోడికత్తి, బాబాయి హత్యను వాడుకుని జగన్ అధికారంలోకి వచ్చారు. ఈ రెండు విషయాలను సోషల్ మీడియాలో బాగా వైరల్ చేయించుకున్నారు. ఇదంతా టీడీపీయే చేయించిందంటూ నింద మోపి లబ్ది పొందారు. తన తండ్రి చావుతో వచ్చిన సింపతీకి తోడు బాబాయి చావుతో వచ్చిన సింపతీని మిక్స్ చేసుకుని మరీ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసుకుంది. వెరసి జగన్ అధికారంలోకి వచ్చారు. ఆ తరువాత ఆ కేసులన్నింటినీ తొక్కిపట్టారు. అయినా నిజాలు బయటకు రాకుండా పోవుగా.. వచ్చేశాయి. ఇప్పుడు ఆ కేసుల ఊసే లేదు.
జగన్ రియల్ లైఫ్ నటుడు అని చేర్చారా?
తాజాగా జగన్ టీంకు ధీటుగా మీమర్స్ సైతం సోషల్ మీడియాను వాడేస్తున్నారు. రాజకీయాలను సినిమాలతో లింకప్ చేసి మరీ మీమ్స్ వదులుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు స్టార్ హీరోలను వాడుకుని జగన్‌కు కౌంటర్ ఇచ్చారు. నందమూరి నటసింహం బాలకృష్ణ, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన జగన్‌ను చేర్చేశారు. జగన్ రియల్ లైఫ్ నటుడు అని చేర్చారా అని అంటారా? ఏమో.. అది కూడా ఒక కారణం అయ్యుండొచ్చు కానీ మెయిన్ అర్ధం మాత్రం వేరు. ప్రభాస్‌ను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చక్కగా వాడుకున్నారట. బాలయ్యను బోయపాటి, తారక్‌ను దర్శకధీరుడు రాజమౌళి, బన్నీకి సుకుమార్ మంచిగా వాడుకుని హిట్స్ కొట్టారు. ఇక వీరి సరసన జగన్ పేరును చేర్చి బాబాయ్, తండ్రి చావును సుకుమార్ కరెక్ట్‌గా వాడుకున్నారని కౌంటర్ ఇచ్చారు. వావ్.. సూపర్బ్ కదా.