ప్యాన్ ఇండియా స్టార్స్ ప్రభాస్-ప్రశాంత్ నీల్ కలయికలో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన సలార్ ఎన్నో అంచనాలు, మరెన్నో వాయిదాల నడుమ నేడు డిసెంబర్ 21 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాహుబలి ప్రభాస్, KGF దర్శకుడు కలయిక అంటే అందరి చూపు సలార్ పైనే ఉంటుంది. టీజర్, ట్రైలర్, ప్రమోషన్స్ విషయంలో సో సో ఆనిపించుకున్నా.. సలార్ విడుదల సమయానికి మాత్రం విపరీతమైన క్రేజీగా మారింది. యూత్ మొత్తం సలార్ థియేటర్స్ కి కదిలేలా చేసింది. ప్యాన్ ఇండియా ప్రేక్షకులు థియేటర్స్ కి పరిగెత్తేలా చేసింది.
ఇక విడుదలైన ప్రతి భాషలో సలార్ కి పాజిటివ్ టాక్ వచ్చేసింది. సలార్ భీబత్సం గురించే మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా సలార్ ప్రభంజనం కనిపించింది. ప్రభాస్ మాస్ కొటౌట్ గురించి ప్రభాస్ ఫాన్స్ కి పూనకాలొచ్చేస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ లో 20 మినిట్స్ గురించిన ముచ్చటే వినిపిస్తుంది. ఓవరాల్ గా సలార్ క్రేజీ బ్లాక్ బస్టర్ అని తేల్చేసారు. దానితో ఇప్పుడు సలార్ డిజిటల్ పార్ట్నర్ పై అందరిలో ఆత్రుత, ఆసక్తి బయలుదేరాయి.
మరి ఈ మధ్యన బిగ్ బడ్జెట్ మూవీస్ అన్నిటిని ఎగరేసుకుపోయే నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు సలార్ ఓటీటీ రైట్స్ ని ఛేజిక్కించుకుంది. ఈ డీల్ కోసం నెట్ ఫ్లిక్స్ దాదాపు 200 కోట్లు కోట్ చేసినట్లుగా తెలుస్తోంది. సలార్ పై అంచనాలు ఏ రేంజ్ ఉన్నాయో ఈ డీల్ వింటేనే అర్ధమవుతుంది. ఇక సలార్ అయితే ఇప్పుడప్పుడే ఓటిటిలోకి వచ్చే ఛాన్స్ లేదు అని.. ఈరోజు నుంచి 60 రోజుల తర్వాతే సలార్ నెట్ ఫ్లిక్స్ నుంచి ఓటిటి ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది అని తెలుస్తుంది.