Advertisementt

టాలీవుడ్ లో ఆ ఘనత తారక్ కే దక్కింది

Fri 22nd Dec 2023 07:37 PM
jr ntr  టాలీవుడ్ లో ఆ ఘనత తారక్ కే దక్కింది
Tarak got that honor in Tollywood టాలీవుడ్ లో ఆ ఘనత తారక్ కే దక్కింది
Advertisement
Ads by CJ

ఆర్.ఆర్.ఆర్ తో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ చిత్రంలో భీమ్ పాత్రలో ప్రేక్షకుల గుండెల్లో పది కాలాలు గుర్తుండిపోయేలా నటించాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ హాలీవుడ్ లోను పెరిగిపోయింది. ఆర్.ఆర్.ఆర్ కి తగ్గకుండా ఆయన తన తదుపరి చిత్రం దేవర తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్, విలన్ గా సైఫ్ అలీ ఖాన్ లు నటిస్తుండగా.. ఇప్పుడు తారక్ మరో అరుదైన రేర్ ఫీట్ సాధించాడు.

అది 2023 లో ఆసియ లోని టాప్ 50 జాబితాలో తారక్ స్థానం సంపాదించాడు. టాప్ 50 లో నిలిచిన నటుల జాబితాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ 25 వ స్థానంలో ఉన్నాడు. టాలీవుడ్ నుంచి ఈ ఫీట్ సాధించిన ఏకైక హీరో తారక్ కావడం గమనార్హం. ఎన్టీఆర్ 25 వ స్థానం లో ఉన్నట్లుగా ఆసియన్ వీక్లీ న్యూస్ ఈస్టర్న్ ఐ 2023 ప్రకటించింది. ఈ జాబితాలో మొదటి స్థానంలో షారుఖ్ ఉండగా.. మరికొంతమంది బాలీవుడ్ నటులు ఈ టాప్ 50 లో ఉన్నారు.

మరి టాలీవుడ్ లో ఏ హీరోకి దక్కని ఘనత ఎన్టీఆర్ కి దక్కడం పట్ల ఎన్టీఆర్ ఫాన్స్ విపరీతమైన సంతోషంలో మునిగిపోయారు. 

Tarak got that honor in Tollywood:

Jr NTR ranked 25th, Asian Weekly News Eastern Eye 2023

Tags:   JR NTR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ