బిగ్ బాస్ విన్నర్ గా గెలిచిన సంతోషం లేకుండా చేసిన పల్లవి ప్రశాంత్ అభిమానుల వలన ప్రశాంత్ గత రెండు రోజులుగా చంచల్ గూడా జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు. పల్లవి ప్రశాంత్ అభిమానులమంటూ అల్లరి ముఖాలు చేసిన చేష్టలకి పోలీసులు పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేసారు. పల్లవి ప్రశాంత్ పోలీసులకి దొరక్కుండా పారిపోయాడంటూ వార్తలొచ్చిన కొన్ని గంటల్లోనే పల్లవి ప్రశాంత్ ని పోలీసులు ఆయన ఇంటి వద్దే అరెస్ట్ చేసారు.
అయితే నిన్న పల్లవి ప్రశాంత్ నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ కోసం అప్లై చేసాడు. నిన్న గురువారం వాదనలు విన్న కోర్టు తీర్పుని వెలువరించలేదు. పల్లవి ప్రశాంతను 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో అరెస్టయిన ప్రశాంత్ ని కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు వాదోపవాదనలు విన్న నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కాకపోతే ఆదివారం పోలీసులు ముందు విచారణ కు హాజరు కావాలి అని పల్లవి ప్రశాంత్ కి కోర్టు తెలిపింది..
మరికొద్దిసేపట్లో పల్లవి ప్రశాంత్ విడుదల కాబోతున్నాడు. ఇదే కేసులో మరికొంతమంది పల్లవి ప్రశాంత్ అభిమానులుగా పిలవబడే మైనర్స్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వారి పేరెంట్స్ ఈ విషయంలో పల్లవి ప్రశాంత్ పై ఫైర్ అయిన విషయం తెలిసిందే.