సౌత్ నుంచి బాలీవుడ్ కి వెళ్లి అక్కడ పెరఫార్మెన్స్ ఓరియెంటెడ్ చిత్రాలతో హైలెట్ అయ్యి.. తనదైన ముద్ర వేసిన తాప్సికి ఇప్పటివరకు స్టార్ హీరోల సరసన నటించే అవకాశం కలగలేదు. అసలు ఆమెకి పెద్ద సినిమాల్లో కనిపించే ఛాన్స్ కూడా రాలేదు. కాని ఫస్ట్ టైమ్ తాప్సికి షారుఖ్ మూవీలో ఛాన్స్ తగిలింది. అది కూడా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ తో ఛాన్స్ తగలడంతో తాప్సి గాల్లో తేలిపోయింది. షారుఖ్-రాజ్ కుమార్ కలయికలో వచ్చిన డంకి చిత్రంలో తాప్సి మన్ను రన్దావా పాత్రని పోషించింది.
తాప్సి నటన పరంగా సూపర్బ్ అనిపించింది. కానీ షారుఖ్ ఖాన్ తాప్సిని ఆదుకోలేకపోయాడు. ఎందుకంటే నిన్న గురువారం వరల్డ్ వైడ్ గా విడుదలైన డంకి చిత్రం బావుంది అన్నా.. ఆ సినిమాకి వచ్చిన ఓపెనింగ్స్ చూస్తే మాత్రం దానికి పేక్షకులని ఆకట్టుకోవడంల విఫలమైంది అనే చెప్పాలి. మొదటి రోజు కలెక్షన్స్ కనీసం 50 కోట్ల గ్రాస్ ని ఎక్స్ పెక్ట్ అతి కష్టం మీద 30 కోట్ల మార్కుని దాటడం SRK ఫ్యాన్స్ ని నిరాశ పరిచింది.
సౌత్ లోనే కాదు నార్త్ ఆడియన్స్ ని కూడా డంకి మూవీ మెప్పించలేదని సోషల్ మీడియా చూస్తే తెలుస్తుంది. ఈ ఏడాది సూపర్ సక్సెస్ అందుకున్న జవాన్, పఠాన్ ల సరసన డంకి నిలుస్తుంది అనుకుంటే.. ఈ చిత్రం మాత్రం ప్రేక్షకులని మోసం చేసింది. సలార్ ఓపెనింగ్స్ పై డంకి చిత్రం ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకున్నారు. కానీ సలార్ కింగ్ లా బాక్సాఫీసు ని చెడుగుడు ఆడడం ఖాయంగా కనబడతుంది. సో డంకి సినిమా వలన తాప్సి హిట్ అందుకుంటుంది అనుకుంటే.. డంకి టాక్ తో తాప్సి నిరాశపడిపోతుంది.