బిగ్ బాస్ లో హైలెట్ అయ్యి కప్ అందుకుని బయటికొచ్చాక ఆ సక్సెస్ ని ఎంజాయ్ చెయ్యనియ్యకుండానే అభిమానుల అరాచకంతో జైలు పాలయిన పల్లవి ప్రశాంత్ అరెస్ట్ ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. బిగ్ బాస్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ పేరు అనౌన్స్ చెయ్యగానే సిద్ధిపేట ముద్దుబిడ్డ రైతు బిడ్డ అంటూ హరీష్ శంకర్ చేసిన వైరల్ కాగా.. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అరెస్ట్ విషయంలో BRS నేత ఒకరు సోషల్ మీడియాలో ఈ విధంగా ట్వీట్ చేసారు.
ప్రజా ప్రభుత్వంలో ఒక రైతు బిడ్డ అరెస్ట్...
మట్టిలో నుంచి బిగ్ బాస్ విన్నర్ దాక ఎదిగిన ప్రశాంత్
రైతు బిడ్డ సెలేబ్రిటిగా మారినందుకు సంతోషించాల్సింది పోయి అరెస్ట్ చేసిన ప్రభుత్వం
తన కుటుంబ సభ్యులకు ఇచ్చిన భద్రత బందోబస్తు, లక్షలాది మంది అభిమానించే పల్లవి ప్రశాంత్ కు ఇవ్వడంలో విఫలమైన సీఎం
విజయోత్సవర్యాలీ కి దగ్గరుండి గైడ్ చేయాల్సింది పోయి, లాఠీ ఛార్జి చేసిన పోలీసులు
గెలిచిన ఆనందాన్ని పంచుకునే లోపే అరెస్ట్ చేసి లోపల వేసిన వైనం
ఒక సినీ హీరో అయితే ముందే బందోబస్తు, భద్రతా ఇచ్చేవారా లేదా
ఇలానే అరెస్ట్ చేస్తారా ప్రశ్నిస్తున్న నెటిజన్లు.
ఇది మట్టి బిడ్డ పై రైతు బిడ్డపై జరిగిన దాడి అంటున్న గ్రామీణ యువత అంటూ BRS నేత.. కాంగ్రెస్ ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పల్లవి ప్రశాంత్ ని అడ్డం పెట్టుకుని వేసిన ట్వీట్.
ఇది చూసిన కొంతమంది నెటిజెన్స్ అరె బిగ్ బాస్ లో ఆ అమర్ డీప్ అనవసరంగా పల్లవి ప్రశాంత్ ని హీరోని చేసాడు. బయట ఆయన ఫాన్స్ ఆయన్ని అందలం ఎక్కించారు. రైతు బిడ్డ అంటూ సింపతీ క్రియేట్ చేసుకుని కప్ కొట్టుకుని కామ్ గా ఉండకుండా అతి చేస్తూ వేషాలు వేసి ఇప్పుడు జైల్లో కూర్చున్నాడు.. ఇతనికి మళ్ళీ రాజకీయ మద్దతా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.