ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్-ప్యాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో భారీగా తెరకెక్కిన సలార్ నేడు శుక్రవారం డిసెంబర్ 21న ప్యాన్ ఇండియాలోని పలు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. శుక్రవారం తెల్లవారుఝాము 1 గంట నుంచే థియేటర్స్ దగ్గర ప్రభాస్ ఫాన్స్ బారులు తీరారు. 1 గంటకే మొదలైన బెన్ ఫిట్ షోస్ తో ప్రభాస్ ఫాన్స్ సందడి మాములుగా లేదు. సలార్ మ్యానియాతో ప్రభాస్ ఫాన్స్ మాత్రమే కాదు.. కామన్ ఆడియన్స్ కూడా సలార్ టికెట్స్ కోసం ఎగబడ్డారు. అంతలాంటి హైప్ తో నేడు ఆడియన్స్ ముందుకు వచ్చిన సలార్ ఎలా ఉందో బెన్ ఫిట్ షోస్ టాక్, ఓవర్సీస్ టాక్ లో చూసేద్దాం.
ప్రభాస్ మాస్ ఎంట్రీకి పూనకాలు షురూ, ప్రభాస్ ఓపెనింగ్ సీన్ వేరే లెవల్.. ఇక ప్రీ ఇంటర్వెల్ అయితే గూస్ బంప్స్.. ప్రభాస్‌తో ఉన్న యాక్షన్ బ్లాక్స్ అన్నీ వేరే లెవల్లో ఉన్నాయంటూ ఓవర్సీస్ ఆడియన్స్ ట్విట్టర్ X లో హడావిడి మొదలు పెట్టారు. ప్రభాస్‌కి ఇది పర్ఫెక్ట్ మాస్ కమ్ బ్యాక్ అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్‌కి ఇచ్చిన ఎలివేషన్లు చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి అంటూ ఫ్యాన్స్ ట్వీట్లు వేస్తున్నారు. ఇక ఇంటర్వెల్ అయితే మరణ మాస్ అంటూ పోస్ట్ చేశాడు.
అసలు సినిమాలో మూడు సీన్లు చాలు.. మెంటలెక్కిపోవడానికి. మెంటల్ మాస్ బ్లాక్ బస్టర్ సలార్. భువన్ గౌడ సినిమాటోగ్రఫి, రవి బస్రూర్ మ్యూజిక్ సినిమాను ఊహించని విధంగా ఎలివేట్ చేశాయి. ముఖ్యంగా రవి బస్రూర్ బీజీఎం సెకండాఫ్‌లో ఓ లెవెల్ లో యాక్షన్ సీన్స్ ని హైలెట్ చేసింది. కలర్ టోన్‌తో సీన్లను మరింత ఎమోషనల్‌గా భువన్ గౌడ చూపించాడు. యాక్షన్ సీన్లను చిత్రీకరించిన తీరు సినిమాకు మరో హైలెట్. బ్లడీ బ్లడ్ బాత్.. ఇది బ్లాక్ బస్టర్ అమ్మా మొగుడంటూ ప్రభాస్ ఫాన్స్ రచ్చ చేస్తున్నారు.
సలార్ కి ప్రతి భాషలోనూ పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది, సలార్ హిట్ అంటూ ప్రతి భాష క్రిటిక్ ట్వీట్ చేస్తున్నాడు. సలార్ బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్ అంటూ ప్రభాస్ ఫాన్స్ ట్విట్టర్ X లో చెలరేగిపోతున్నారు.