నాలుగు వీధుల అవతల ఇల్లు కాలుతుంటే.. నా ఇల్లు ఎక్కడ తగలడుతుందోనని పూర్తిగా తడిపేసుకున్నాడట.. అంత దూరం నుంచి నిప్పు వచ్చి వీడి ఇంటిపై పడేది లేదు.. అలాగని తగలబడేది లేదు. కానీ వాడు పోసిన నీళ్లతో ఇంట్లోని సామానంతా ఆగమై.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయి పూర్తిగా తగలబడిపోయింది. దీనిని ఒక్కసారి తెలంగాణ, ఏపీలకు అన్వయించుకుందాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోబీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. సిట్టింగ్‌లకే సీట్లు అని చెప్పి వెనుకా ముందు ఆలోచించక వారందరికీ టికెట్లు ఇచ్చి బొక్క బోర్లా పడ్డారు. అది చూసిన జగన్ తానెక్కడ పడతానో అని ముందుగానే భయపడి.. సిట్టింగ్‌ల్లో సగం మందిని పక్కకు నెట్టే ప్రయత్నం మొదలు పెట్టారు.
ప్రభుత్వానికి ఓ అల్టిమేటం జారీ చేసి..
కేసీఆర్ ఇల్లు తగలబడింది కాబట్టి తన ఇంటికి నిప్పు అంటుకోకుండా జగన్ అతి తెలివితో చేస్తున్న పనులివి. నాడు కేసీఆర్ సిట్టింగ్‌లను నమ్మి నష్టపోతే.. ఇప్పుడు జగన్ నమ్మక నష్టపోతున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జులను వరుసబెట్టి మారుస్తూ పోతున్నారు. దీంతో ఆయా ఎమ్మెల్యేలంతా ప్రభుత్వానికి ఓ అల్టిమేటం జారీ చేసి ఎవరి దారి వారు చూసుకునే పనిలో ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలకు ముందే జగన్‌కు భారీ దెబ్బ పడబోతోంది. కేసీఆర్ సిట్టింగ్‌లకే టికెట్లు కేటాయించడం కారణంగా ఓడిపోయారనేది కొంతవరకూ నిజమే అయినా ఆయన ఓటమికి మెయిన్ కారణం మాత్రం అహంభావం. దానిని సహించలేక జనం దెబ్బేశారు. ఈ విషయాన్ని గ్రహించని జగన్.. తను అనుకున్నదే నిజమని ఎమ్మెల్యేలను తప్పించే పనిలో పడ్డారు.
75 రావడం కూడా కష్టమే..
నిజానికి కేసీఆర్ చేసిన అభివృద్ధి మరే సీఎం చేసి ఉండరేమో కానీ అహకారానికి పెద్ద దెబ్బ పడింది. మరి అభివృద్ధిని విస్మరించి సంక్షేమ పథకాలనే అభివృద్ధిగా చెప్పుకొంటున్న ఏపీ సీఎం జగన్‌కు ఎలాంటి దెబ్బ తగులుతుంది? కేసీఆర్‌ను మించిన మోనార్క్ జగన్. అహంకారానికి ఐకాన్. ఈ విషయాన్ని తెలుసుకుంటే లాభం చేకూరుతుంది కానీ నియోజకవర్గ ఇన్‌చార్జులను తొలగిస్తే ఏం ప్రయోజనం? వారంతా ఎదుతిరిగితే నష్టం ఎవరికి? ఇలాంటి పరిస్థితుల్లో ‘వైనాట్ 175’ పక్కనబెడితే.. 75 రావడం కూడా కష్టమే. తెలంగాణ పరిస్థితులు వేరు.. ఏపీ పరిస్థితులు వేరు. తను గెలవడానికి ఏం చేయాలో జగన్ ఆలోచించాలి కానీ కేసీఆర్ ఏం చేస్తే ఓడిపోయారనేది అంచనాలు వేసి వాటిలో నిజమెంతనేది ఆలోచన లేకుండా గుడ్డి గుర్రం మాదిరిగా పరుగులు దీస్తే దెబ్బ తినాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలో ఎమ్మెల్యేలపై అపనమ్మకం ఉన్నా కానీ కేసీఆర్‌ని చూసి ఓటేసేవారు కానీ ఇక్కడ పెద్ద సమస్యే కేటీఆర్ ఇగో. ఇది జగన్ అర్థం చేసుకుంటే బాగుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.