Advertisementt

దేవర గ్లిమ్ప్స్ కి రంగం సిద్ధం

Thu 21st Dec 2023 01:07 PM
jr ntr,devara  దేవర గ్లిమ్ప్స్ కి రంగం సిద్ధం
Devara glimpse is set to release for this new year దేవర గ్లిమ్ప్స్ కి రంగం సిద్ధం
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కలయికలో ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న దేవర షూటింగ్ ప్రస్తుతం బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం క్రిష్టమస్, న్యూ ఇయర్ కి ఎన్టీఆర్ గ్యాప్ తీసుకుని మళ్ళీ దేవర కొత్త షెడ్యూల్ లో జాయిన్ అవుతాడని తెలుస్తుంది. ఈ గ్యాప్ లో కొరటాల దేవర గ్లిమ్ప్స్ పై దృష్టి పెట్టారట. న్యూ ఇయర్ కి దేవర నుంచి గ్లిమ్ప్స్ విడుదల చేస్తారనే టాక్ ఉంది. రీసెంట్ గా కళ్యాణ్ రామ్ కూడా డెవిల్ ఈవెంట్ లో దేవర మీద సూపర్ అప్ డేట్ ఇచ్చారు.

తాజాగా దేవర నుంచి రాబోయే టీజర్ లో కొరటాల శివ సృష్టించే కొత్త ప్రపంచం ఓ రేంజ్ లో ఉండబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. న్యూ ఇయర్ రోజున దేవర గ్లిమ్ప్స్ పక్కా అంటున్నారు. దానికి సంబందించిన వర్క్ కూడా చేపిస్తున్నట్టుగా తెలుస్తుంది. జాన్వీ కపూర్ తో ఎన్టీఆర్ కాంబో సీన్స్ కూడా గ్లిమ్ప్స్ లో చూస్తారు, అలాగే యాక్షన్ సీన్ ని కూడా యాడ్ చేస్తారని తెలుస్తుంది. దేవర గ్లిమ్ప్స్ తోనే సినిమాపై అంచనాలు పెరిగేలా కొరటాల శివ పక్కా ప్లానింగ్ తో రెడీ చేస్తున్నట్లుగా సమాచారం. 

Devara glimpse is set to release for this new year:

Jr NTR Devara glimpse is set to release for this new year

Tags:   JR NTR, DEVARA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ