Advertisementt

ఢీ షో: పూర్ణ ప్లేస్ లోకి మరో హీరోయిన్

Thu 21st Dec 2023 11:00 AM
pranitha subhash  ఢీ షో: పూర్ణ ప్లేస్ లోకి మరో హీరోయిన్
Dhee Show: Another heroine in Poorna place ఢీ షో: పూర్ణ ప్లేస్ లోకి మరో హీరోయిన్
Advertisement
Ads by CJ

ఈటీవీలో ప్రతి బుధవారం ప్రసారమయ్యే ఢీ డాన్స్ షో గత కొన్నేళ్లుగా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇప్పటికే ఢీ నుంచి 15 సీజన్స్ వచ్చాయి. గత వారమే సీజన్ 15 ముగియగా.. ఈ సీజన్ సెలెబ్రిటీ సీజన్ గా అనౌన్స్ చేసారు. అయితే గత కొన్ని సీజన్స్ గా ప్రదీప్ మాచి రాజు యాంకర్ గా ఈ ఢీ షో నడుస్తుంది. కానీ సెలెబ్రిటీ షోకి మాత్రం ప్రదీప్ మాచిరాజు ప్లేస్ లోకి హీరో నందు వచ్చాడు. నందు హోస్ట్ గా ఈ షో ఈ బుధవారం ప్రపారం అయ్యింది.

అయితే కొన్నాళ్లుగా శేఖర్ మాస్టర్ తో కలిసి హీరోయిన్ పూర్ణ వన్ అఫ్ ద జేడ్జ్ గా ఢీ షోలో కనిపించేవారు. ఆమె అప్పుడప్పుడు బ్రేక్ తీసుకుంటే సదా, జానీ మాస్టర్ లాంటి వాళ్ళు ఆమె ప్లేస్ లోకి వచ్చేవారు. కానీ ఈ సెలెబ్రిటీ సీజన్ షోకి మాత్రం పూర్ణ తప్పుకోగా ఓ కొత్త హీరోయిన్ ఆమె ప్లేస్ లోకి వచ్చింది. ఆమె ప్రణీత సుభాష్. టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోలతో నటించిన ప్రణీతకి హీరోయిన్ గా అనుకున్నంతగా సక్సెస్ సాధించలేకపోయింది. కోవిడ్ సమయంలో పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో సెటిల్ అయిన ప్రణీత మాత్రం ఇప్పటికీ గ్లామర్ గా సినిమాల్లో నటించడానికి రెడీగానే ఉంది.

అయితే పెళ్లయిన హీరోయిన్స్ కి అవకాశాలు రావడం చాలా అరుదు. అందుకే ప్రణీత ఇలా ఓ రియాలిటి షో కి జెడ్జ్ గా వచ్చింది. ప్రణీత, శేఖర్ మాస్టర్ జెడ్జెస్ గా ఢీ సెలెబ్రిటీ షో ఈ రోజు బుధవారం గ్రాండ్ గా మొదలయ్యింది . 

Dhee Show: Another heroine in Poorna place:

Pranitha Subhash replaces Poorna in Dhee show

Tags:   PRANITHA SUBHASH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ