అన్నపూర్ణ స్టూడియోస్ లో బిగ్ బాస్ సెట్ ఎదుట బిగ్ బాస్ విన్నర్ అభిమానుల అల్లరిమూకలు నానా యాగీ చేసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ గొడవ విపరీతంగా వైరల్ అయ్యింది. దానితో విన్నర్ ప్రశాంత్ పై పోలీస్ కేసు నమోదు అయ్యింది. అయితే పోలీసులకి దొరక్కుండా షో చేసిన పల్లవి ప్రశాంత్ ని నిన్న గజ్వేల్ లో తన ఇంటి వద్దనే అరెస్ట్ చేసి విచారణ అనంతరం పోలీసులు చంచల్ గూడా జైలుకి తరలించారు.
పల్లవి ప్రశాంత్ ని నిన్న రాత్రి గజ్వేల్ లో అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు..
ఆరు గంటల పాటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారించిన పోలీసులు..
ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం ప్రైవేటు ఆస్తులు ధ్వంసం కేసులో అరెస్ట్ చూపెట్టిన పోలీసులు..
సెలబ్రిటీ ముసుగులో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే చూస్తూ ఊరుకోమంటున్న పోలీసులు..
జడ్జి ఇంట్లో పల్లవి ప్రశాంత్ తో పాటు ఆయన సోదరుడిని ప్రవేశపెట్టిన పోలీసులు..
14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన న్యాయమూర్తి..
దానితో పల్లవి ప్రశాంత్ తో పాటు అతని సోదరుని చంచల్ గూడ జైలు కు తరలించిన పోలీసులు..