ఈరోజు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజవకర్గం పోలిపల్లిలో యువగళం-నవశకం సభలో చాలా అరుదైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు-పవన్ కళ్యాణ్-నారా లోకేష్-బాలకృష్ణ ఒకే వేదికపై చూసిన టీడీపీ,జనసేన కార్యకర్తలు జై జైలు పలికారు.
ఈ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..
లోకేష్ చేసిన యువగళం పాదయాత్ర.. జగన్ మాదిరిగా బుగ్గలు నిమిరే యాత్ర కాదు. ప్రజల బాధలు తెలుసుకున్న పాదయాత్ర. ఇలాంటి పాదయాత్రల వల్ల చాలా అనుభవాలు ఎదురవుతాయి. నేను చెయ్యలేకపోయాను, కానీ లోకేష్ చేసి చూపించారు. నాకు రాని అవకాశాన్ని లోకేశ్ దిగ్విజయంగా పూర్తి చేయడం ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తి భారత దేశానికి చాలా కీలకం. చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు చాలా బాధ కలిగింది. ఏదో ఆశించి చంద్రబాబుకు మద్దతివ్వలేదు. సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు నావంతు సాయంగా ఉండాలనే మద్దతిచ్చానన్నారు.
మనకు రాజధాని లేకుండా, సరైన పంపకాల్లేకుండా విభజన జరిగిన కష్ట సమయంలో ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీకి మద్దతిచ్చా. 2024లో టీడీపీ-జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. మార్పు తీసుకొస్తున్నాం.. జగన్‌ను ఇంటికి పంపించేస్తున్నాం. జగన్ 80 మంది ఎమ్మెల్యేలను మారుస్తున్నారని వింటున్నాం. మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు.. జగన్‌ను అంటూ పవన్ కళ్యాణ్ యువగళం-నవశకం సభలో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.