కొద్దిసేపటి క్రితమే బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ని గజ్వేల్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. గత రెండు రెజులుగా పల్లవి ప్రశాంత్ పోలీసులకి దొరక్కుండా అజ్ఞాతంలో ఉన్నాడు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్న పల్లవి ప్రశాంత్ ఈరోజు మీడియా ముందుకు వచ్చి తాను ఎక్కడికి పారిపోలేదు, కొంతమంది యూట్యూబ్ వాళ్ళు తాను ఇంటర్వ్యూ ఇవ్వలేదు అని.. ఇలాంటి నెగెటివిటి స్ప్రెడ్ చేస్తున్నారు. తానేమి పారిపోలేదు, తన ఇంట్లోనే ఉన్నాను, తనకేమన్నా అయితే వాళ్లదే బాధ్యత అంటూ ఏదేదో మాట్లాడాడు. తనపై ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే వాళ్ళ ఫొటోస్ ని, పేర్లని బయటపెడతాను, మీరే చూసుకోండి ప్రజలారా అంటూ మాట్లాడిన కొద్దిగంటల్లోనే పల్లవి ప్రశాంత్ ని గజ్వేల్ లో పోలీసులు అదుపులోకి తీసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.
బిగ్ బాస్ రన్నర్ అమర్ దీప్ ఫ్యామిలీ కారుపై, ఇంకాకొంతమంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కార్లపై పల్లవి ప్రశాంత్ అభిమానులు దాడి చేసి రాళ్లు రువ్వడంతో.. కార్లు డ్యామేజ్ అయిన వాళ్ళు పోలీస్ కేసు పెట్టారు. అంతేకాకుండా వాళ్ళు ప్రశాంత్ ని ర్యాలీ చెయ్యకుండా అడ్డుకున్నప్పటికీ.. పోలీసులు షరతులని భేఖాతర్ చేసిన పల్లవి ప్రశాంత్ పై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసారు. నిన్న ఉదయం తనపై పెట్టిన కేసుల విషయం తెలుసుకున్న పల్లవి ప్రశాంత్ ఎవ్వరికి కనబడకుండా పరార్ అయ్యాడు. అతని కోసం మూడు పోలీసు బృందాలు గాలించి చివరికి గజ్వేల్ లో పల్లవి ప్రశాంత్ ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది.