పల్లవి ప్రశాంత్ పరార్, బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పారిపోయాడు, పోలీసులకి దొరక్కుండా పల్లవి ప్రశాంత్ తప్పించుకు తిరుగుతున్నాడు, అరెస్ట్ భయంతో దాక్కున్న పల్లవి ప్రశాంత్.. ఈ హెడ్ లైన్స్ ఈరోజు సోషల్ మీడియా ఓపెన్ చెయ్యగానే కనిపించినవి. పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు కావడంతో అరెస్ట్ కి భయపడి పల్లవి ప్రశాంత్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకుని నిన్నటినుంచి ఎవ్వరికీ కనిపించకుండా ఉండడంతో పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి అతన్ని పట్టుకునేందుకు వెతుకుతున్నారంటూ టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ లో వార్తలొచ్చాయి.
అయితే పల్లవి ప్రశాంత్ ఎక్కడికి పారిపోలేదు.. అతను అందుబాటులోనే ఉన్నాడంటూ పల్లవి ప్రశాంత్ లాయర్ రాజేష్ చెప్పడం గమనార్హం. అమర్ దీప్ కారుని పల్లవి ప్రశాంత్ అభిమానులు డ్యామేజ్ చెయ్యడంతో ఆ కేసు పల్లవి ప్రశాంత్ మెడకి చుట్టుకుంది. ఈ కేసులో A1 గా పల్లవి ప్రశాంత్, A2 గా పల్లవి ప్రశాంత్ సోదరుడిని చేర్చారు పోలీసులు. అయితే పల్లవి ప్రశాంత్ ఎక్కడికి పారిపోలేదు, అతను పోలీసులకి సహకరిస్తాడని అంటున్నారు. అతను తన ఇంటికి సమీపంలోనే స్నేహితులతో కలిసి ఉన్నాడంటూ రాజేష్ తెలిపారు.
కానీ ఇప్పటికీ పలు ఛానల్స్ లో పల్లవి ప్రశాంత్ అరెస్ట్ భయంతోనే తప్పించుకున్నాడని, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసాడని అంటున్నారు. మరోపక్క పోలీసులు పల్లవి ప్రశాంత్ కొమురవెల్లి దగ్గర ఒకచోట ఉన్నట్లుగా గుర్తించారట. ప్రస్తుతం పోలీసులు అక్కడికి వెళ్లి పల్లవి ప్రశాంత్ ని అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది అని సమాచారం.