ప్రస్తుతం ఇంటా బయట మొత్తం సలార్ సెన్సేషన్ నడుస్తుంది, కనిపిస్తుంది. ప్రభాస్ గత మూడు సినిమాలు నిరాశపరిచినా.. ఆయన లేటెస్ట్ చిత్రం సలార్ పై భీభత్సమైన అంచనాలున్నాయి. ఎంతగా అంటే బుకింగ్స్ ఓపెన్ చేస్తున్నారు అని తెలియగానే నైజాం ఏరియా అభిమానులు థియేటర్స్ దగ్గర క్యూ లైన్ లో పుడిగాపులు కాచేంతగా. అంతేకాకుండా నిన్న రాత్రి 8 గంటలకు నైజాం ఏరియాలో టికెట్లు బుక్ మై షోలో అందుబాటులో ఉంచిన క్షణాల వ్యవథిలో బుక్ మై షో క్రాష్ కావడం చూసి ప్రభాస్ అభిమానులతో పాటుగా సాధారణ ప్రేక్షకులు కూడా షాక్ తిన్నారు.
చాలావరకు అన్ని థియేటర్లు లిస్ట్ బయటికి రాలేదు. సగానికి పైగానే అందుబాటులో రావాల్సి ఉంది. అయినా ప్రభాస్ ఫాన్స్ బుక్ మై షో పై పడ్డారు. భీబత్సం సృష్టించారు. గంటలో వేలాదిగా టికెట్ బుకింగ్స్ జరగడం ఫస్ట్ టైమ్ చూస్తున్నామంటున్నారు సినీ ప్రేమికులు. 22 తెల్లవారి ఝామున స్పెషల్ బెన్ ఫిట్ షోస్ అయిన 1, 4 గంటల షోల టికెట్లు భారీ ధరైనా లెక్క చెయ్యకుండా కోనేసారు, క్షణాల్లో ఆ షోస్ టికెట్స్ అమ్ముడయ్యాయి. ఇక క్యూ లైన్ టికెట్ కౌంటర్లు దగ్గర అభిమానుల రద్దీని అదుపు చేయలేక పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది.
మరి శుక్రవారం తెల్లవారి ఝాము నుంచే థియేటర్స్ దగ్గర టపాసుల మోత, ఫాన్స్ హంగామాతో సలార్ టాక్ వచ్చేస్తుంది. మీడియా, సోషల్ మీడియా, అభినులు మొత్తం సలార్ గురించే మాట్లాడుకుంటారు. ఆంధ్రలో ఎలా ఉన్నా, తెలంగాణాలో పెరిగిన టికెట్ రేట్స్ ని కూడా ప్రేక్షకులు లెక్క చేయ్యడం లేదు అంటే.. సలార్ మ్యానియా ఏ రేంజ్ లో ఉందో అర్ధమైపోతుంది. టాక్ ఏ మాత్రం పాజిటివ్ గా కనిపించినా సలార్ సెన్సేషన్ ని ఆపడం ఎవ్వరి తరము కాదు.