అక్కినేని నాగార్జునని అరెస్ట్ చెయ్యాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చెయ్యడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. కింగ్ నాగార్జున హోస్ట్ గా ప్రసారమైన బిగ్ బాస్ నిర్వాహకులపై దానికి హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జునపై అడ్వకేట్ అరుణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. ఒక ఇంట్లో అక్రమంగా వంద రోజులు పాటు కొంతమంది వ్యక్తులని నిర్బంధించడంపై అభ్యంతర వ్యక్తం చెయ్యడమే కాకుండా, బిగ్ బాస్ లో పాల్గొన్న వారిని కూడా విచారించాలని అరుణ్ తన పిటిషన్ లో పేర్కొన్నాడు.
ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికొచ్చాక ఫాన్స్ ని రెచ్చగొడుతూ.. ప్రభుత్వ ఆస్తులని ధ్వంశం చెయ్యడంపై కూడా విచారణ జరపాలని పిటీషనర్ పేర్కొన్నాడు. అయితే బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునని అరెస్ట్ చెయ్యాలంటూ అరుణ్ హైకోర్టులో పిటిషన్ వెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. గతంలోనూ ఇలాంటి కేసులు బిగ్ బాస్ పై, నాగార్జునపై కూడా వచ్చాయి. సిపిఐ నారాయణ ఇప్పటికి నాగార్జునని ఈ విషయంలో టార్గెట్ చేస్తూనే ఉన్న విషయం తెలిసిందే.