బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ సమయంలో అమర్ దీప్-పల్లవి ప్రశాంత్ లు గొడవపడితే బయట ఆ ఇద్దరి ఫ్యాన్స్ ఫైట్ చేసుకున్నారు. పల్లవి ప్రశాంత్ ఫాన్స్ అయితే అమర్ దీప్ అమ్మని, భార్యని టార్గెట్ చేస్తూ అసభ్యకరమైన పోస్ట్ లు చేస్తూ చీప్ గా బిహేవ్ చేసారు. ఇక హౌస్ లో వాళ్ళిద్దరి మధ్యన మధ్యలో స్నేహం కుదిరినా చివరి వారాల్లో మరోసారి గొడవ పడడంతో అమర్ దీప్ పై బయట పల్లవి ప్రశాంత్ ఫాన్స్ బాగా పగ పెట్టుకున్నారు. పల్లవి ప్రశాంత్ విన్నర్ గా, అమర్ దీప్ రన్నర్ గా బయటికొచ్చారు
అమర్ దీప్ బయటికి రాగానే పల్లవి ఫాన్స్ అమర్ ని కొట్టడానికి వెళ్లారు. అంతేకాకుండా అమర్ దీప్ తల్లి, ఆయన భార్య ప్రయాణిస్తున్న కారు అద్దాలు పగలగొట్టారు. అమర్ దీప్ పై కక్షతోనే ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ కారు అద్దం పగలగొట్టి అమర్ ని బయటికి లాగే ప్రయత్నం చేసారు. ఈ విషయమై పల్లవి ప్రశాంత్ పై కేసు కూడా నమోదు అయ్యింది. తాజాగా ఈ ఇష్యుపై అమర్ దీప్ మట్లాడుతూ.. గెలవలేను అనుకున్న వాడిని గెలుపుదాకా తీసుకొచ్చారు. మీ అందరికి కృతఙ్ఞతలు. నా కారు మీద దాడి చేస్తూ రాళ్లతో కొట్టారు, కారు అద్దాలు పగలగొట్టారు.
ఇలా చెయ్యాల్సింది కాదు. నన్ను ఎక్కడికైనా రమ్మంటే ఒక్కడినే వచ్చేవాడిని, కానీ నా ఫ్యామిలీని టార్గెట్ చేసి రోడ్డు మీద నిలబెట్టేసారు. నేను ఎవ్వరికి భయపడను. మీ ఇంట్లోనూ ఓ అమ్మ, అక్క, చెల్లి, భార్య ఉన్నారు. మీ వాళ్ళని అలానే చేస్తారా.. ఈ రాళ్ల దాడిలో మా అమ్మకి, భార్యకి ఏమైనా జరిగితే ఎవరు బాద్యులు. మన పక్కన ఉన్న వాళ్ళకి ఏమి జరగకుండా మనం చూసుకోవాలి. కానీ ఈదాడిలో ఏమైనా జరిగి ఉంటే నేను ఎవ్వరిని కోల్పోయే వాడినో తెలియదు. ఆనందంతో నేను బయటికి వస్తా అనుకుంటే నా కుటుంబంతో సహా నన్ను నడి రోడ్డు మీద నిలబెట్టేసారు.
నేను రిక్వెస్ట్ చేస్తున్నా.. ఇలా ఎవ్వరిని చెయ్యకండి.. నా గెలుపు కోసం పని చేసిన అందరికి ధన్యవాదాలు అంటూ అమర్ తన వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేసాడు.