ఈరోజు మంగళవారం సలార్ నైజాం బుకింగ్స్ ఓపెన్ అవుతాయని మేకర్స్ అలా ప్రకటించారో.. లేదో.. ఇలా RTC X Roads లో ప్రభాస్ ఫాన్స్ క్యూలోకి వచ్చేసారు. ఈసారి బాక్సాఫీసు వద్దే టికెట్స్ కొనుగోలు చెయ్యాలని చెప్పడంతో RTC X Rods సంధ్య థియేటర్ దగ్గర ఫాన్స్ లైన్ లో నిలబడి వెయిట్ చేస్తున్నారు. మరి ఆన్ లైన్ లో, బుక్ మై షో లేని సమయంలో ప్రేక్షకులు ఇలా లైన్ లోనే నించుని టికెట్స్ కొనుగోలు చేసేవారు.
గతంలో అదే స్టార్ హీరోల సినిమాలకి అభిమానులు ఇలానే లైన్ లో నిలబడి, తోసుకుని మరీ టికెట్స్ కోసం బాక్సాఫీసు వద్ద ఎగబడేవారు. ఆ తర్వాత ఆన్ లైన్ లో టికెట్స్ కొనుగోలు చేయడం మొదలు పెట్టాక ఇలాంటి తోపులాట కానీ, లైన్ లు కానీ కనిపించలేదు. మళ్ళీ ప్రభాస్ సలార్ పుణ్యమా ఇన్నాళ్ళకి ఇలాంటి క్యూ లైన్స్ కనిపిస్తున్నాయి. RTC X Roads సంధ్య థియేటర్ లో ప్రభాస్ ఫాన్స్ లైన్ లో నించుని సలార్ టికెట్స్ కోసం గేట్లు తోసుకుంటూ వస్తున్న వీడియోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది చూసాక మళ్ళీ పాత రోజులు గురు చేస్తున్నారు సలార్ మేకర్స్ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.