గతంలో మోడ్రెన్ డ్రెస్సులతో సోషల్ మీడియాలో సందడి చేసిన అనసూయ కొద్దిరోజులుగా పట్టు శారీస్, మోడ్రెన్ శారీస్ తో స్టయిల్ మార్చేసింది. షాప్ ఓపెనింగ్స్ అంటూ తెగ హడావిడి చేస్తుంది. బట్టల షాప్ ల ఓపెనింగ్స్ కి వెళుతూ కంచిపట్టు శారీస్ కట్టుకుని వయ్యారాలు పోతుంది. ఇప్పటివరకు శారీస్ తోనే ఫొటోస్ షూట్స్ షేర్ చేసిన అనసూయ ఇప్పుడు మళ్ళీ పాత పంథాలోకి వచ్చేసింది.
అంటే మళ్ళీ మోడ్రెస్ డ్రెస్ తో సొగసులు చూపించడానికి రెడీ అయ్యింది. మోడ్రెన్ అవుట్ ఫిట్ లో అనసూయ అదరగొట్టేసింది. మళ్ళీ పదహారేళ్ళ అమ్మాయిలా మారిపోయింది. 40 ప్లస్ లోను అనసూయ అద్భుతంగా కనిపిస్తుంది. ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ పై సినిమాలతో కాదు ప్యాన్ ఇండియా మూవీస్ తో చాలా బిజీగా ఉంటుంది. ప్రస్తుతం క్రేజీ సీక్వెల్ పుష్ప ద రూల్ లో నటిస్తుంది. ప్రస్తుతం అనసూయ సోషల్ మీడియాలో క్రేజీగా కనిపిస్తుంది.