Advertisementt

సలార్ వీటితో సరిపెట్టుకోండి

Tue 19th Dec 2023 10:34 AM
salaar  సలార్ వీటితో సరిపెట్టుకోండి
Salaar release trailer sensation సలార్ వీటితో సరిపెట్టుకోండి
Advertisement
Ads by CJ

సలార్ ట్రైలర్, దాని వెనుక కొద్దిరోజులకే రిలీజ్ ట్రైలర్ వదిలారు, ఎస్.ఎస్ రాజమౌళి తో కామన్ ఇంటర్వ్యూ ఇక్కడితో ఫినిష్, ఇకపై సలార్ నుంచి ఏమి ఎక్స్ పెక్ట్ చెయ్యొద్దు అనేది మేకర్స్ మాట. సలార్ ప్రమోషన్స్ విషయంలో ఫాన్స్ ఎంతగా ఎర్రెత్తి పోయి ఉన్నారో చూసాము, కామన్ ఆడియన్స్ కూడా సలార్ ప్రమోషన్స్ గురించి మాట్లాడుకున్నారు. కానీ మేకర్స్ కి కాన్ఫిడెన్స్, లేదంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందో ఏమో.. సలార్ ప్రమోషన్స్ ని లైట్ తీసుకున్నారు. నిన్న రిలీజ్ అయిన ప్రీ రిలీజ్ ట్రైలర్ మాస్ ఆడియన్స్ కి బాగానే ఎక్కేసింది.

అయితే ఇకపై సలార్ నుంచి ఎలాంటి సాంగ్స్ విడుదల కావు, ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉండదు, నిన్న సెకండ్ ట్రైలర్ ని కూడా యూట్యూబ్ లోనే విడుదల చేసారు కానీ.. ఎక్కడా హంగామా చెయ్యలేదు. అలాగే ప్రభాస్, ప్రశాంత్ నీల్ ఇద్దరూ మీడియా తో ఇంటరాక్ట్ అవ్వరట. మరి ఈ చిన్నపాటి ప్రమోషన్స్ తోనే సలార్ హైయ్యెస్ట్ ఓపెనింగ్ తెస్తుంది అని ఫాన్స్ గంపెడు ఆశలు పెట్టుకున్నారు.

టాక్ ఏ మాత్రం బాగున్నా రికార్డులు కొల్లగొట్టడం ఖాయమంటున్నారు. అది ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబో ఫైర్ అంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు వేస్తున్నారు. మరో పక్క సలార్ చాలా బాగా వచ్చింది, సినిమా హిట్ అంటూ ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. 

Salaar release trailer sensation:

Salaar 1: Prabhas and Prithviraj action-drama is pure goosebumps

Tags:   SALAAR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ