Advertisementt

NBK109 పై అది రూమర్ మాత్రమే

Mon 18th Dec 2023 10:11 PM
nbk109  NBK109 పై అది రూమర్ మాత్రమే
NBK109 shooting update NBK109 పై అది రూమర్ మాత్రమే
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ-బాబి కలయికలో గత నెలలో మొదలైన NBK109 మూవీ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. మధ్య మధ్యలో బాలయ్య అన్ స్టాపబుల్ షో కోసము, ఇంకా అప్పుడప్పుడు యాడ్ షూట్స్ కోసము కాస్త గ్యాప్ ఇస్తూ బయటికి వస్తున్నారు తప్ప.. బాబీ తో బాలయ్య గ్యాప్ లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ చిత్రం వచ్చే ఏడాది ఏపీ ఎన్నికల సమయానికల్లా విడుదల కావాలని బాలయ్య ఆలోచన. ఈ చిత్రం పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది అనేది ప్రీ లుక్ పోస్టర్ లోనే రివీల్ చేసేసారు.

అయితే ఈ చిత్రం రాయలసీమ ఫ్యాక్షన్, పొలిటికల్ నేపథ్యంలో ఉంటుందని, కథకు సంబంధించిన ముఖ్యమైన సీన్స్ ఈ నెల 20వ తేదీ నుండి అనంతపురం జిల్లాలో ఓ 17రోజులు పాటు షూటింగ్ జరుపుకుంటుంది అంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ హైలెట్ అయ్యింది. అయితే అనంతపురంలో NBK109 షూటింగ్ జరుపుకుంటుంది అనేది పూర్తిగా రూమర్ అంటూ బాలకృష్ణ అనంతపురం అభిమాన సంఘ అధ్యక్షుడు జగన్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసారు. NBK109 ముఖ్యమైన సీన్స్ ఈ నెల 20వ తేదీ నుండి అనంతపురం జిల్లాలో 17రోజులు పాటు షూటింగ్ ఉంటుందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం, అలాంటి ఆలోచన కూడా చేయలేదని డైరెక్టర్ బాబీ గారు చెప్పినట్లుగా ఆయన తెలిపారు.

NBK109 shooting update:

Balakrishna- Bobby NBK109 shooting update

Tags:   NBK109
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ