Advertisementt

సలార్ ట్రైలర్ పబ్లిక్ టాక్

Mon 18th Dec 2023 07:36 PM
salaar trailer  సలార్ ట్రైలర్ పబ్లిక్ టాక్
Salaar trailer public talk సలార్ ట్రైలర్ పబ్లిక్ టాక్
Advertisement
Ads by CJ

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ చిత్రం సలార్ మ్యానియా సోషల్ మీడియాలో విపరీతంగా కనిపిస్తుంది. సలార్ పోస్టర్స్ చూసి ఇంప్రెస్డ్ అన్నవారే.. సలార్ ట్రైలర్ చూసి పెదవి విరిచారు. డిసెంబర్ 1 న భారీ అంచనాలు నడుమ విడుదలైన సలార్ ట్రైలర్ సినిమాపై బజ్ తగ్గించింది అనే అభిప్రాయాలను వ్యక్తం చేసారు. అందుకే రిలీజ్ ట్రైలర్ అంటూ ఫాన్స్ లో మరో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించారు. మొదటి ట్రైలర్ తో ఢీలాపడిన అభిమానులకి మళ్ళీ మాస్ యాక్షన్ ట్రైలర్ తో మేకర్స్ సమాధానం చెప్పాలనుకున్నారు.

ఇక ఈరోజు సోమవారం విడుదలైన సలార్ ట్రైలర్ ఫుల్లీ యాక్షన్ ట్రైలర్. అందులో ప్రభాస్ ఫాన్స్ మెచ్చే ప్రభాస్ మాసివ్ లుక్, ఆయన యాక్షన్ చూసి ఇది కదా కావాల్సింది ఫాన్స్ కి అంటున్నారు. మాస్ కి కిక్కిచ్చే భారీ యాక్షన్ ఎపిసోడ్స్, ప్రభాస్ హై వోల్టేజ్ డైలాగ్స్, ముఖ్యంగా పృథ్వీ రాజ్ సుకుమారన్ దోస్తీ, విలనిజం, ప్రభాస్ కటౌట్ అన్ని ఫాన్స్ కి బాగా నచ్చేసాయి. మరోపక్క KGF తో మరోసారి సలార్ ని పోల్చేవాళ్లూ ఉన్నారు. ఇంకెంతకాలం బొగ్గు చూపిస్తావ్, కొంచం కలర్ మార్చయ్యా నీలు... బొగ్గు గనులు కూడా అక్కడక్కడ పచ్చగా ఉంటుంది, KGF ని చూస్తున్నట్టుగా ఉంది, కొత్తదనం ఏమి లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరికొందరు సలార్ ట్రైలర్ లో ప్రభాస్ అలా బైక్ మీదొస్తుంటే ఆ ఊపు మాములుగా లేదు, ప్రభాస్ ఫాన్స్ విజిల్స్ వెయ్యడం పక్కా, ఈసారి సలార్ తో 100 కోట్ల ఓపెనింగ్స్ సాధించడం ఖాయం, ప్రశాంత్ నీల్ కి తెలుసు మాస్ పల్స్ అంటూ సలార్ పై తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

 

Salaar trailer public talk:

Salaar release trailee public talk

Tags:   SALAAR TRAILER
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ