బిగ్ బాస్ లో రైతు బిడ్డ ట్యాగ్ తో సింపతీ గేమ్ వర్కౌట్ అవడంతో పోరాడి గెలిచి చివరికి సీజన్7 విన్నర్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్ కి ట్రోఫీ అందుకుని బయటికి రాగానే పోలిసులు బిగ్ షాక్ ఇచ్చారు. పల్లవి ప్రశాంత్ అభిమానులమంటూ అమర్ దీప్ పై ఆయన ఫ్యామిలీపై దాడి చేస్తూ కార్ల అద్దాలను ధ్వంశం చెయ్యడం, గవర్నమెంట్ ప్రోపర్టీని ధ్వంశం చెయ్యడంతో పోలీసులు పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు చేసారు. అంతేకాకుండా మిగతా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అశ్విని, గీతూ రాయల్ కార్ల అద్దాలు కూడా అభిమానులు పగలగొట్టడంతో గీతూ, అశ్వినిలు కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు.
అటు RTC ఎండి సజ్జనార్ కూడా హోస్ట్ నాగార్జున, స్టార్ మా యాజమాన్యపు ఫైర్ అయ్యారు. అయితే తన అభిమానులతో మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు అని పల్లవి ప్రశాంత్ ఏందన్నా గిట్ల రైతు బిడ్డని తొక్కేస్తున్నారంటూ అరిచినా పోలిసులు ర్యాలీ చేసేందుకు ఒప్పుకోలేదు. ఇక నిన్న రాత్రి జరిగిన రచ్చతో పోలీసుల విచారణ జరిపి బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు చేసారు. జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో సుమోటోగా కేస్ నమోదు కాగా 147, 148, 290, 353, 427 రెడ్ విత్, 149 సెక్షన్ల కింద కేసు ఫై చేసారు.
అంతేకాకుండా పల్లవి ప్రశాంత్ అభిమానులపైన కూడా కేసులు నమోదు చేసారు. మరి బిగ్ బాస్ లో టాస్క్ లు ఆడి, సింపతీ ట్యాగ్ తో బయట జనాల మనసులు గెలిచి ట్రోఫీ అందుకున్న పల్లవి ప్రశాంత్ కి పోలీసులు బయటికి రాగానే ఇంత పెద్ద షాకిచ్చారు.