పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ సలార్ సీజ్ ఫైర్ రిలీజ్ ట్రైలర్ కోసం రోజులు, గంటలు, క్షణాలు అంటూ ప్రభాస్ ఫాన్స్ గత వారం రోజులుగా వెయిట్ చేస్తున్నారు. ఇదిగో అదిగో అంటూ అభిమానులని వెయిట్ చేయించి మరీ సలార్ రిలీజ్ ట్రైలర్ ని మేకర్స్ విడుదల చేసారు... హృదయాన్ని హత్తుకునే ఫ్రెండ్ షిప్, వావ్ అనిపించే యాక్షన్ సన్నివేశాలతో ఈ ట్రైలర్ సాగింది. అన్‌కాంప్రమైజ్డ్ బడ్జెట్‌తో అందరూ ఆశ్చర్యపోయే ప్రొడక్షన్ వేల్యూస్‌తో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ ఆకాశాన్నంటింది.
రిలీజ్ ట్రైలర్‌ను గమనిస్తే.. ఇద్దరు పిల్లల మధ్య స్నేహం.. వారి పెరిగి పెద్దయిన తర్వాత కాన్సార్ ప్రాంతానికి రాజు (పృథ్వీరాజ్ సుకుమారన్) కావాలనుకున్న వాడిపై శత్రువులు దాడి చేస్తే తన స్నేహితుడి కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాటం చేసే మరో స్నేహితుడు దేవా (ప్రభాస్) కథే సలార్ సీజ్ ఫైర్ అని స్పష్టమవుతుంది. ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న అంచనాలు రిలీజ్ ట్రైలర్‌తో మరింత పీక్స్‌కి చేరుకున్నాయి. ప్రభాస్ యాక్షన్ అదిరిపోయింది. గాన్ పీల్చదా ఎలాని జస్ట్ ట్రయిల్ చేసి చూపించాడు.
ఓ షాట్ లో హీరోయిన్ శృతి హాసన్ మందు అడగడం.. ప్రభాస్ మాసివ్ లుక్స్, పృథ్వీ రాజ్ సుకుమారన్ లుక్స్, ప్రభాస్ బైక్ మీదొచ్చే సీన్స్ అన్ని హైలెట్ గా నిలిచాయి. క్రిస్మస్ సీజన్‌లో సలార్ సినిమాను రిలీజ్ చేయడంతో ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.