ప్రస్తుతం ప్రభాస్ సలార్ ప్రమోషన్స్ లో ఉంటాడనుకుంటే.. ఆయన మారుతి మూవీ షూట్ లో బిజీ కాబోతున్నారనే న్యూస్ ప్రభాస్ ఫాన్స్ కి నవ్వాలో ఏడ్వాలో తెలీకుండా చేస్తుంది. సలార్ ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్-ప్రశాంత్ నీల్, పృథ్వీ రాజ్ సుకుమారన్ లు రాజమౌళి తో కామన్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంగ్లీష్ లో ఇంటర్వ్యూ చేసి ప్యాన్ ఇండియాలో విడుదలయ్యే భాషల్లో సబ్ టైటిల్స్ తో సరిపెడతారట.
ఇక ప్రభాస్-మారుతీ మూవీ షూటింగ్ కోసం బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నిన్న ఆదివారం, ప్రత్యేకంగా ఫ్లైట్ లో హైదరాబాద్ కి వచ్చారట. ఈరోజు సోమవారం నుంచి ప్రభాస్-మారుతీ కలయికలో మూవీకి సంబంధించి కొన్ని సన్నివేశాల చిత్రీకరణ చేపట్టనున్నారట. అయితే ప్రభాస్-సంజయ్ దత్ కాంబో సీన్స్ మెయిన్ హైలెట్ గా మారుతి మూవీలో ఉంటాయనే టాక్ ఉంది. మరి ఈలెక్కన ప్రభాస్ కూడా మారుతి షూటింగ్ కి వెళితే ఎలా అనేది ప్రభాస్ ఫాన్స్ ఆందోళన.
సలార్ కి ప్రోపర్ గా ప్రమోషన్స్ లేవనే బాధలో వారు ఉన్నారు. ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా పెడితే బావుంటుంది అనేది వాళ్ళ ఫీలింగ్, మరి మేకర్స్ ఇలాంటి వేడుకలకి తావు లేకుండా ఓ కామన్ ఇంటర్వ్యూతోనే సరిపెట్టేసారు. ఇక ప్రభాస్-మారుతి మూవీ హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది అని, ఈ మూవీలో ప్రభాస్ తో ముగ్గురు హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ లు ప్రభాస్ తో రొమాన్స్ చెయ్యబోతున్నారు.