మెగా డాటర్ నిహారిక అంటే తెలియని వారుండరు. బిగ్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్ అలాగే పెళ్లి విషయంలోనూ నిహారిక పేరు మీడియాలో మోగిపోయింది. చైతన్య జొన్నలగడ్డని అంగరంగ వైభవంగా వివాహం చేసుకుని అంతే స్పీడుగా విడాకులు ఇచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఇండస్ట్రీలో బిజీ అయ్యే ప్రయత్నాల్లో ఉంది. యాక్టింగ్ కన్నా ముఖ్యంగా నిర్మాతగా మారి బిజీ కాబోతుంది. తన ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తూ షాప్ ఓపెనింగ్స్‌కి కూడా హాజరవుతుంది.
రీసెంట్‌గానే అన్న వరుణ్ తేజ్, వదిన లావణ్యలతో తన నిర్మాణ సంస్థని ఓపెనింగ్ చేయించిన నిహారిక.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో క్రేజీ ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పడు కొత్త ఫోటోలతో సరికొత్త అవుట్ ఫీట్స్‌తో, డిజైనర్ దుస్తుల్లో నిహారిక స్పెషల్‌గా కనిపిస్తుంది. తాజాగా జీన్స్ స్కర్ట్ లో పింక్ కలర్ టైట్ ఫిట్‌లో నిహారిక మెరిసిపోతూ కనిపించింది. కూల్‌గా నుంచొని గోళ్లు గిల్లుకుంటూ గోడపై అలా వాలింది. ప్రస్తుతం నిహారిక లేటెస్ట్ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.