సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు #Salaar హాష్ టాగ్స్, #Dunki హాష్ టాగ్స్ దర్శనమిస్తున్నాయి. డిసెంబర్ 21న షారుఖ్ డంకి, డిసెంబర్ 22న ప్రభాస్ సలార్ సినిమాలు బాక్సాఫీసు బరిలోకి దిగుతున్నాయి. ఈ రెండు సినిమాలపై భీభత్సమైన అంచనాలున్నాయి. అసలే షారుఖ్ రెండు బిగ్గెస్ట్ హిట్స్‌తో క్రేజీగా కనబడుతున్నాడు. ప్రభాస్‌లో బాహుబలి ఊపు ఇంకా తగ్గలేదు, అందుకే సలార్ పై హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. సోషల్ మీడియాలోనూ రెండు సినిమాల హాష్ టాగ్స్‌తో అభిమానుల రచ్చ వేరే లెవల్ అన్నట్టుగా ఉంది.
సలార్ బుకింగ్స్ ఓపెన్, డంకి బుకింగ్స్ ఓపెన్ ఇలా సోషల్ మీడియాలో ఈ రెండు సినిమాల ముచ్చట్లు తప్ప మరొకటి కనిపించడమే లేదు, సలార్ కొత్త ట్రైలర్ పై ట్వీట్స్, డంకి షారుఖ్ పై ట్వీట్స్. ఇవన్నీ చూస్తుంటే సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. ఏ హీరో అభిమానులూ తగ్గడం లేదు. షారుఖ్ ఫాన్స్ vs ప్రభాస్ ఫాన్స్ అన్న రేంజ్ లో డంకి vs సలార్ అన్నట్టుగా ఉంది ప్రస్తుత సోషల్ మీడియా వ్యవహారం.
#SalaarCeaseFire #Prabhas𓃵, #SalaarReleaseTrailer, #DunkiAdvanceBooking , #DunkiFirstDayFirstShow, #DunkiDrop5 #SRK ఇలా ట్విట్టర్ ఓపెన్ చెయ్యగానే దర్శనమిస్తున్న హాష్ టాగ్స్. ఇది చూసే నెటిజెన్స్ సరదాగా సలార్, డంకి సోషల్ మీడియా వార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.