సూపర్ స్టార్ మహేష్ బాబు ఏదైనా గేమ్ షోస్ లో కానీ, లేదంటే పబ్లిక్ ఈవెంట్స్ లో కానీ చాలా అరుదుగా కనిపిస్తారు. అయితే మహేష్ బాబు ఈరోజు స్టార్ మాలో ప్రసారం కాబోయే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి అతిధిగా వచ్చి విన్నర్ కి బిగ్ బాస్ ట్రోఫీని అందజెయ్యబోతున్నారని ప్రచారం జరిగింది. కింగ్ నాగార్జున మహేష్ బాబుని ఆహ్వానించడంతో మహేష్ ఒప్పుకున్నారనే న్యూస్ నడిచింది. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం మహేష్ గెస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి రాలేదట.
మహేష్ బాబు బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే కి గెస్ట్ గా వస్తున్నారనేది అవాస్తవమని, అసలు మహేష్ ని బిగ్ బాస్ యాజమాన్యం కానీ, నాగార్జున కానీ సంప్రదించలేదని తెలుస్తుంది. దానితో మహేష్ ఫ్యాన్స్ డిస్పాయింట్ అవుతున్నారు. సూపర్ స్టార్ ని బిగ్ బాస్ వేదికపై చూస్తామని ఆశతో ఉన్న వారికి ఇప్పుడు నిరాశ ఎదురైంది. ఇక ఈరోజు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో ఆరుగురు ఫైనలిస్ట్ లలో అర్జున్ అంబటి మొదటిగా ఎలిమినేట్ కాగా.. ఐదో స్థానంలో ప్రియాంక జైన్ ఎలిమినేట్ అయ్యింది.
ఇక నాలుగో స్థానంలో ప్రిన్స్ యావర్ 15 లక్షల సూట్ కేసుతో బయటికి వెళ్లిపోగా.. శివాజీ మూడో స్థానంతో సరిపెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. విన్నర్ గా పల్లవి ప్రశాంత్, రన్నర్ గా అమర్ దీప్ నిలిచారు. హోస్ట్ నాగార్జునానే తన చేతుల మీదుగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కి బిగ్ బాస్ ట్రోఫీ అందించినట్లుగా లీకులు చెబుతున్నాయి.