ఇంకేముంది ఈరోజు ఆదివారం సలార్ టీమ్ రిలీజ్ ట్రైలర్ వదులుతుంది అంటూ సోషల్ మీడియా మొత్తం హోరెత్తిపోయింది. సలార్ ఫస్ట్ ట్రైలర్ లో దమ్ము తగ్గింది అందుకే రిలీజ్ ముందు మరో ట్రైలర్ వదిలి హైప్ క్రియేట్ చేస్తారని అన్నారు. అది ఈ రోజే అంటూ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒకటే ట్వీట్స్. సలార్ యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ అంటూ ప్రభాస్ ఫాన్స్ నానా గోల చేస్తున్నారు.
అయితే సోషల్ మీడియాలో ఇంతగా ప్రచారం జరిగినా మేకర్స్ మాత్రం ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇక ఈరోజు ఇప్పటివరకు సలార్ రెండో ట్రైలర్ జాడ లేకపోయేసరికి సలార్ రిలీజ్ ట్రైలర్ పోస్ట్ పోన్డ్ అంటూ వార్తలు మొదలయ్యాయి. అంటే రేపు ఏమైనా సలార్ రిలీజ్ ట్రైలర్ ఉండొచ్చేమో, ఆ విషయమై మేకర్స్ ఏమైనా ప్రకటన ఇస్తారేమో అంటున్నారు. మరి సలార్ మేకర్స్ ఇంతవరకు రెండో ట్రైలర్ పై ఎలాంటి న్యూస్ ఇవ్వలేదు.
ఇప్పుడు కూడా కామ్ గానే ఉన్నారు, కానీ ఈ ట్రైలర్ విషయమై ఏమి మాట్లాడడం లేదు. చూద్దాం ఈ శుక్రవారం విడుదల కాబోతున్న సలార్ సెకండ్ ట్రయిలర్ ఉంటుందో, లేదో అనేది.. ప్రస్తుతం అయితే సలార్ విడుదలకాబోతున్న అన్ని భాషల్లో సలార్ బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి.