Advertisement

రేవంత్ ఇచ్చింది KTRకి.. తగిలింది వైసీపీకి

Sun 17th Dec 2023 12:21 PM
revanth reddy  రేవంత్ ఇచ్చింది KTRకి.. తగిలింది వైసీపీకి
Revanth Reddy vs KTR రేవంత్ ఇచ్చింది KTRకి.. తగిలింది వైసీపీకి
Advertisement

తెలుగు రాష్ట్రాల పరిస్థితి అవిభక్త కవలల మాదిరిగా తయారైంది. ఇక్కడ ఎవరిని గిచ్చినా కూడా అక్కడ వాళ్లకు దెబ్బ తగులుతుంది. తెలంగాణలో భూకంపం వస్తే.. ప్రకంపనలు ఏపీలో వస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి గుణపాఠంగా మారాయి. వెంటనే నియోజకవర్గ ఇన్‌చార్జిలను మార్చడం ప్రారంభించారు. నిన్నటికి నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్యే కేటీఆర్‌ల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలకు రేవంత్ ఇచ్చేపడేశారు. అయితే దెబ్బ గట్టిగా తగిలింది మాత్రం ఏపీలోని వైసీపీ ప్రభుత్వానికి.

అసలు రేవంత్ ఏమన్నారంటే..

కేటీఆర్.. తమకంటే కేవలం 1.85 శాతం అధికంగా ఓట్లు సాధించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చారని అన్నారు. దీనికి కౌంటర్‌గా రేవంత్.. కొందరు ఎన్ఆర్ఐ నాయకులకి ప్రజాస్వామ్యం విలువ, స్పూర్తి అర్దం కావని.. ప్రజాస్వామ్యంలో 49 శాతం ఓటింగ్ శాతానికి సున్నా విలువ ..51 శాతానికి 100 శాతం విలువ ఉంటుందన్నారు. కేవలం 1.85 ఓట్ల తేడానే మిమ్మల్ని ప్రతిపక్షంలో.. మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టిందని తెలిపారు. చంద్రబాబు దయ తలిస్తేనే కేసీఆర్ ఎమ్మెల్యే అయ్యారన్నారు. చీమలు పెట్టిన పుట్టలో పాములు జొర్రినట్టు కేకే మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తే ఆయన్ను పక్కకు తప్పించి మీరంతా మంత్రి పదవులు పొందారని రేవంత్ విమర్శించారు.

అధికారంలోకి వచ్చి ఐదేళ్లవుతున్నా..

నిజానికి కేటీఆర్‌కు రేవంత్ బీభత్సంగా చురకలు వేశారు. కానీ అవి ఆయనకు తగిలి తిరిగి ఏపీలోని వైసీపీ వారి వైపు దూసుకెళ్లాయి. కేటీఆర్, కేసీఆర్‌లు ఎలా అయితే అహంభావ పూరిత వ్యాఖ్యలు చేస్తున్నారో ఏపీలో వైసీపీ అధినేత సహా మంత్రులంతా అలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఐదేళ్లవుతున్నా అభివృద్ధి నిల్. బీఆర్ఎస్ నేతల మాదిరిగానే తమ వైఫల్యాలను టీడీపీ నెత్తిన రుద్దుతూ కాలక్షేపం చేస్తున్నారు. తెలంగాణలో అభివృద్ధి అయినా ఉంది కానీ ఏపీలో అది కూడా లేదు. కేసీఆర్ మాదిరిగానే ఏపీ సీఎం జగన్ కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తిని తుంగలో తొక్కుతున్నారు. తెలంగాణలో జరిగిన తప్పులే ఏపీలోనూ జరుగుతున్నాయి. రేవంత్ ఇస్తున్న ఒక్కొక్క కౌంటర్‌కి వైసీపీ నేతలు తమ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందేమోనని ఠారెత్తిపోతున్నారు. 

Revanth Reddy vs KTR:

Revanth fought with KTR.. but got hit with YCP

Tags:   REVANTH REDDY
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement