హరీష్ శంకర్, రవితేజ తో సినిమా అనౌన్స్ చేసింది మొదలు ఆ సినిమా అప్ డేట్స్ తో సోషల్ మీడియా నిండిపోయింది. రెండు రోజుల ముందు రవితేజ-హరీష్ శంకర్ ల కాంబోలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్లు సినిమాని తెరకెక్కిస్తున్నారంటూ ప్రకటన రావడమే తరువాయి.. రవితేజ తో రొమాన్స్ చేయబోయే హీరోయిన్ భాగ్యశ్రీ బోర్స్ పేరుని నిన్న శనివారం అనౌన్స్ చేసారు. అది వచ్చిన 24 గంటలోపే టైటిల్ వచ్చేసింది. మరోసారి రవితేజ అభిమానంతో అమితాబ్ బచ్చన్ పేరునే తన సినిమా అదే టైటిల్ పెట్టేసుకున్నాడు.
గతంలో డాన్ శీను లో అమితాబ్ కి వీరాభిమానిగా నటించిన రవితేజ ఈసారి హరీష్ తో చేస్తున్న మూవీకి మిస్టర్ బచ్చన్ అంటూ పవర్ ఫుల్ టైటిల్ పెట్టేసుకున్నారు. మిస్టర్ బచ్చన్ అంటూ టైటిల్ పోస్టర్ రవితేజ అమితాబ్ బచ్చన్ యొక్క ఐకానిక్ పోజ్‌ను అనుకరిస్తున్నట్లు పోస్టర్ కూడా వదిలారు. రవితేజ పాత స్కూటర్‌పై షేడ్స్‌తో స్టైల్‌గా కూర్చుని కనిపిస్తున్నాడు. అతని వెనుక మనం నటరాజ్ థియేటర్ మరియు అమితాబ్ బచ్చన్ సినిమా పోస్టర్ చూడవచ్చు. అయితే రవితేజ ఈ చిత్రంలో అమితాబ్ సినిమా ప్రేమికుడా? లేదంటే అమితాబ్ బచ్చన్‌కి వీరాభిమానా? అనేది తెలియాల్సి ఉంది.
బిగ్ బి-నామ్ తో సునా హోగా అనే పాపులర్ డైలాగ్ మిస్టర్ బచ్చన్ సినిమా ట్యాగ్ లైన్. మరి రవితేజ ఈగల్ పనులు పూర్తికాకుండానే హరీష్ శంకర్ తో మిస్టర్ బచ్చన్ ని మొదలు పెట్టబోతున్నట్లుగా ఈ అప్ డేట్స్ చూస్తే అర్ధమైపోతుంది. ఇదే స్పీడు కంటిన్యూ చేస్తూ వచ్చే ఏడాది మిడిల్ లోనే మిస్టర్ బచ్చన్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు.