మంచు మనోజ్ మొదటగా ప్రణతి రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆమెతో విభేదాల కారణంగా ప్రణతికి విడాకులిచ్చేసి భూమా నాగిరెడ్డి-శోభా నాగి రెడ్డిల రెండో కుమర్తె మౌనికని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ ఏడాది మార్చి లో మంచు మనోజ్ మౌనిక మెడలో మూడు ముళ్ళు వేసి ఏడడుగులు నడిచాడు. మౌనికకి కూడా ఇది రెండో వివాహమే, ఆమె మొదటి భర్తకి ఓ బాబు కూడా ఉన్నాడు. మౌనిక మెడలో మూడు ముళ్ళు వేసినప్పుడే మనోజ్ మౌనిక కొడుకు ధైరవ్ బాధ్యతలను తీసుకున్నాడు. ఆతర్వాత మౌనికతో సంతోషంగా ఉంటున్న మనోజ్ నేడు ఎక్స్ పెక్ట్ చెయ్యని శుభవార్త వినిపించాడు.
శోభా నాగిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆమెని స్మరించుకుంటూ మనోజ్ ఈ మధురమైన వార్తను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. అత్తమ్మ అంటూ శోభనాజిరెడ్డిని సంబోధిస్తూ మీ ప్రేమ పూర్వకమైన రోజున ఈ సంతోషకరమైన వార్తను పంచుకుంటున్నాను. మామ భూమా నాగిరెడ్డిగారు తాతయ్య కాబోతున్నారు. ధైరవ్ అన్న కావడం పట్ల అతృతతో ఉన్నాడు. ఎదుగుతున్న, పెరుగుతన్న మా కుటుంబాన్ని మీరు చల్లగా చూస్తూ ఉంటారని, మమ్మల్ని రక్షిస్తూ ఉంటారని అనుకుంటున్నాను.
మా అమ్మ నిర్మలాదేవి, నాన్నగారు మోహన్ బాబు ఆశిస్సులతో, మా ఫ్యామిలీ అన్ని మూలల నుంచి ప్రేమతో ఆహ్వానిస్తున్నాము అంటూ మంచు మనోజ్ తండ్రి కాబోతున్న విషయాన్ని తెలియజేసాడు. మౌనిక, ధైరవ్ లతో మనోజ్ టెడ్డీలని పట్టుకుని ఉన్న పిక్ ని షేర్ చేస్తూ ఈ సంతోషకమైన వార్తని అందించాడు. మంచువారి ఫ్యామిలీలోకి కొత్త మెంబెర్ రాబోతున్నట్లుగా మనోజ్ ప్రకటించడంతో అందరూ మనోజ్-మౌనికలకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.